స్టాక్ మార్కెట్‌లో యంగ్ ఇన్వెస్టర్ల జోరు!

The states with the highest number of equity investors - Sakshi

స్టాక్ మార్కెట్‌లో యంగ్ ఇన్వెస్టర్ల జోరు భారీగా పెరుగుతోంది. 20-30 ఏళ్ల  వయసున్న ఇన్వెస్టర్లు డబ్బులు సంపాదించడానికి స్టాక్ మార్కెట్లే మంచిది అనే అభిప్రాయానికి ఎక్కువ వస్తున్నారు. అందుకే, ఈ మధ్య స్టాక్ మార్కెట్లు కూడా జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయిలో కొత్త పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌లోకి వస్తున్నారు, ప్రతి నెలా ఒక మిలియన్ కు పైగా కొత్త ఖాతాలు తెరుస్తున్నారు. మరీ ముఖ్యంగా, ఇటీవల ప్రతి రాష్ట్రం నుంచి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది.బీఎస్ఈ విడుదల చేసిన డేటా ప్రకారం.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచే కోటికి పైగా మొత్తం రిజిస్టర్డ్ పెట్టుబడిదారులు ఉన్నారు. 

మహారాష్ట్ర దాదాపు 1.9 కోట్ల రిజిస్టర్డ్ పెట్టుబడిదారులతో యునో హోదాను పొందింది. గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుత రిజిస్టర్డ్ పెట్టుబడిదారుల సంఖ్య 1.01 కోట్లుగా ఉంది. ఆ తర్వాత స్థానాలలో ఉత్తరప్రదేశ్(72.4 లక్షల రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు), కర్ణాటక(52.5 లక్షలు), తమిళనాడు(49.7 లక్షలు) రాష్ట్రాలు ఉన్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, తెలంగాణ, బీహార్, కేరళ, పంజాబ్, ఒడిశా, అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాలు 10 లక్షలకు పైగా రిజిస్టర్డ్ పెట్టుబడిదారులను కలిగి ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగ పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మహారాష్ట్ర పెట్టుబడిదారుల సంఖ్య 48 శాతం పెరిగింది. అలాగే గుజరాత్ 32 శాతం, ఉత్తరప్రదేశ్ 77 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మధ్యప్రదేశ్ గత ఏడాదిలో నమోదైన పెట్టుబడిదారుల సంఖ్యతో పోలిస్తే రెట్టింపు అయ్యింది. వృద్ధి రేటు దాదాపు 104 శాతంగా ఉంది. బీహార్ కూడా 110 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

(చదవండి: ఈ దోసకాయ ఇంత ఖరీదు ఎందుకో తెలుసా..?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top