6 నెలల్లో గృహ ప్రవేశం!

Smr Holdings Launch Of Three New Towers Hamilton - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సొంతిల్లు ప్రతి ఒక్కరి జీవితాశయం. పొదుపు చేసిన సొమ్ముతో, బ్యాంక్‌ రుణంతో ఎలాగోలా కల నెరవేర్చుకోవాలని భావిస్తుంటారు. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కానీ, కస్టమర్లకు గడువులోగా నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలి. అప్పుడే వాళ్లకు ఆనందం. అందుకే నిర్మాణ పనులు తుది దశకు చేరిన తర్వాత అమ్మకాలు ప్రారంభిస్తే కొనుగోలుదారులకు సులువుగా గృహ ప్రవేశం చేసే వీలుంటుంది. ఇదే లక్ష్యంతో 80% నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత లాంచింగ్‌ చేసింది ఎస్‌ఎంఆర్‌ హోల్డింగ్స్‌. కొండాపూర్‌ నిర్మిస్తున్న ఐకానియాలో ఫేజ్‌–3 కింద హామిల్టన్, లోగాన్‌ టవర్లను ప్రారంభించాం. బుకింగ్‌ చేసిన 6, 18 నెలల్లో పూర్తయ్యే విధంగా వివిధ దశలలో టవర్ల నిర్మాణాలున్నాయని కంపెనీ సీఎండీ రాంరెడ్డి తెలిపారు.  

22.5 ఎకరాలలో 55 లక్షల చ.అ. బిల్టప్‌ ఏరియాలో 2,500 ఫ్లాట్లను నిర్మిస్తుంది. 2025 చివరి నాటికి ప్రాజెక్ట్‌ మొత్తం పూర్తవుతుంది. ఫేజ్‌–1 నిర్మాణం పూర్తయింది. 3 బేస్‌మెంట్స్‌ + 20 అంతస్తులలో మొత్తం 400 ఫ్లాట్లుంటాయి. కొనుగోలుదారులు నివాసం ఉంటున్నారు. ఫేజ్‌–2లో స్టాన్లీ టవర్‌. త్రీ బేస్‌మెంట్లు + 27 అంతస్తులలో 538 యూనిట్లు. ఇప్పటికే 150 యూనిట్లు కొనుగోలుదారులకు అందించాం. 10–15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కూడా. మిగిలిన వాటిల్లో ఇంటీరియర్‌ పనులు జరుగుతున్నాయి. 3 నెలల్లో పూర్తవుతాయి. 

ఫేజ్‌–3లో హామిల్టన్‌ టవర్‌. త్రీ బేస్‌మెంట్స్‌ + 30 అంతస్తులలో 240 యూనిట్లు. 80 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి.  ఈ డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం. త్రీ బేస్‌మెంట్లు + 27 ఫ్లోర్లలో లోగాన్‌ టవర్‌ ఉంటుంది. ఇందులో 405 యూనిట్లుంటాయి. 60 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 
 
వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం. శివాలిక్‌ టవర్‌ నిర్మాణం 40 శాతం పూర్తయింది. ఇందులో 589 యూనిట్లుంటాయి. 2024 చివరి నాటికి పూర్తవుతుంది. రానున్న విజయ దశమికి ఫేజ్‌–5లో ఎవరెస్ట్‌ టవర్‌ను ప్రారంభించనున్నాం. త్రీ బేస్‌మెంట్స్‌ + 35 అంతస్తుల్లో 280 ఫ్లాట్లుంటాయి. 

వినియోగంలో రెండు క్లబ్‌ హౌస్‌లు.. 
ఐకానియా ప్రాజెక్ట్‌లో రెండు క్లబ్‌ హౌస్‌లుంటాయి. ఒక్కోటి 60 వేల చ.అ.లలో ఉంటుంది. ఇప్పటికే వీటిని నివాసితులు వినియోగిస్తున్నారు కూడా. జిమ్, స్విమ్మింగ్‌ పూల్, బాంక్వెట్‌ హాల్, మినీ క్రికెట్‌ స్టేడియం, ఇండోర్‌ అండ్‌ ఔట్‌డోర్‌ గేమ్స్‌ వంటి అన్ని రకాల వసతులున్నాయి. ఇందులో గుడిని కూడా నిర్మిస్తున్నారు. 

అద్దె రూ.60 వేలపైనే.. 
ఐకానియాలో ఎక్కువగా కన్సల్టెంట్లు, సీనియర్‌ ఐటీ ఎగ్జిక్యూటివ్స్, అప్‌గ్రేడ్‌ హోమ్స్‌ ఫ్యామిలీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 3 బీహెచ్‌కే ఫ్లాట్‌ అద్దె నెలకు రూ.60–65 వేలు, 4 బీహెచ్‌కే రూ.70–75 వేలుగా ఉన్నాయి. 

1.50 లక్షల చ.అ. కమర్షియల్‌ స్పేస్‌.. 
1.50 లక్షల చ.అ. కమర్షియల్‌ స్పేస్‌ను కూడా అభివృద్ధి చేస్తుంది. ఉద్యోగుల కోసం కో–వర్కింగ్‌ స్పేస్, 40 వేల చ.అ. ఆసుపత్రి, డయాగ్నస్టిక్‌ సెంటర్‌తో పాటు సూపర్‌ మార్కెట్, బాంక్వెట్‌ హాల్, స్పా, బ్యాంక్, కన్వెన్షన్‌ సెంటర్‌ వంటి అన్ని రకాల వసతులుంటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top