రూ.20 వేలు తగ్గిన వెండి రేటు! | Silver Prices Drop in India Know The Latest Price Here | Sakshi
Sakshi News home page

రూ.20 వేలు తగ్గిన వెండి రేటు!

Jun 7 2026 8:06 PM | Updated on Jun 7 2026 8:21 PM

Silver Prices Drop in India Know The Latest Price Here

గడిచిన వారం రోజులు (మే 31 నుంచి జూన్ 6)గా భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి రేటు కూడా గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో దేశంలో ప్రధాన నగరాల్లో సిల్వర్ రేటు ఎలా ఉంది?, అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో మే 31న (ఆదివారం) రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు జూన్ 6 (శనివారం) నాటికి రూ.2.70 లక్షలకు చేరింది. అంటే ఏడు రోజుల్లో రూ.20 వేలు తగ్గిందన్నమాట. ఇదే ధరలు బెంగళూరు, చెన్నైలలో కూడా కొనసాగుతాయి.

అయితే.. ముంబైలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.65 లక్షల వద్ద ఉంది. ఢిల్లీలో కూడా ఇదే ధర కొనసాగుతుంది. దీన్నిబట్టి చూస్తే.. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువని స్పష్టమవుతోంది.

2026లో వెండి రేటు గరిష్టంగా రూ.3 లక్షలు దాటేసింది. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ నేడు జూన్ 7 (ఆదివారం) రూ.2.75 లక్షల వద్ద స్థిరంగా ఉంది. అంటే.. సిల్వర్ రేటు భారీగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

వెండికి ఎందుకు డిమాండ్!
వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. ఇది పారిశ్రామిక రంగంలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. వెండి ఎలక్ట్రానిక్స్‌లో సర్క్యూట్ బోర్డులు, మైక్రోచిప్‌లలో, విద్యుత్ పరిశ్రమలో కేబుల్స్, టర్మినల్స్, కనెక్టర్లలో ముఖ్యంగా వినియోగించబడుతుంది. ఆప్టికల్ పరికరాలు, లెన్స్‌లు, రిఫ్లెక్టర్లు, కొన్ని వైద్య పరికరాలు, డెంటల్ టూల్స్‌లో కూడా వెండి ఉపయోగం ఉంది. కాబట్టి వెండికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది.

ఇదీ చదవండి: తండ్రి మాట.. అంబానీ విజయ రహస్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement