సిగ్నల్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌ : వాట్సాప్‌కు ఝలక్‌

Signal to get several WhatsApp-like features - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ యాజమాన్యంలోని  ప్రముఖ మేసేజింగ్‌ యాప్ ‌వాట్సాప్‌లో కొత్త నిబంధనలు, గోప్యతా విధానాల మార్పుల ఆందోళనల నేపథ్యంలో మరో మెసేజింగ్‌ యాప్‌ సిగ్నల్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. దేశీయంగా వాట్సాప్‌కు ప్రత్యర్థిగా దూసుకొస్తున్న సిగ్నల్‌ వినియోగదారులను తనవైపు తిప్పుకునేందుకు వాట్సాప్‌ తరహాలో ఈ ఫీచర్లను తన యూజర్ల సౌలభ్యం కోసం విడుదల చేసింది. తాము ఎలాంటి యూజర్ ‌డేటాను సేకరించమని ఇండియాతో పాటు,  ప్రపంచవ్యాప్తంగా ప్రజలు  నిర్భయంగా  వాడుకోవచ్చని సిగ్నల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బ్రియాన్ ఆక్టన్ ప్రకటించారు. ఇంత తక్కువ వ్యవధిలో తమకు లభించిన ఆదరణ దీనికి నిదర్శమన్నారు.  సిగ్నల్‌  యూజర్లు ప్రతీ ఒక్కరి భద్రతకు తాము  కట్టుబడి ఉన్నామన్నారు.

కాగా వాట్సాప్‌ కొత్త ప్రైవసీ విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో కోట్లాదిమంది వినియోగదారులు వాట్సాప్‌పై గుర్రుగా ఉన్నారు. ఫలితంగా ప్రత్యామ్నాయాలపై దృష్టి మళ్లిస్తున్నారు. దీంతో టెలిగ్రామ్‌, సిగ్నల్‌ లాంటి యాప్‌లు ఇప్పటికే మార్కెట్లో ఉన్నప్పటికీ, తాజాగా వీటికి మైగ్రేట్‌ అవుతున్న  క్రమంగా పెరుగుతోంది. వినియోగదారుల డేటాకుఎలాంటి ఢోకా లేదు అని వాట్సాప్‌ హామీ ఇచ్చినప్పటికీ ఈ పరంపరం కొనసాగుతోంది. దీన్ని క్యాష్‌ చేసుకునేందుక సిగ్నల్‌ శరవేగంగా పావులు కదుపుతోంది.  వాట్సాప్‌ పోలీన ఫీచర్లతో  దూసుకొస్తోంది.

సిగ్నల్‌లో  కొత్త  ఫీచర్లు 
చాట్ వాల్‌ పేపర్: వాబేటా ఇన్ఫో సమాచారం ప్రకారం తాజా బీటా నవీకరణలో, సిగ్నల్ క్రొత్త ఫీచర్లను విడుదల చేసింది, ఇది వినియోగదారులను చాట్ వాల్‌పేపర్‌ను మార్చడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్  ఇప్పటివరకు సిగ్నల్ ‌యాప్‌లో  అందుబాటులో లేదు. 

స్టేటస్‌ అప్‌డేట్‌: వాట్సాప్ మాదిరిగానే, సిగ్నల్ ఇప్పుడు  స్టేటస్‌ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. 

యానిమేటెడ్ స్టిక్కర్లు: వాట్సాప్‌లో లభించే యానిమేటెడ్ స్టిక్కర్లను కూడా సిగ్నల్  లాంచ్‌ చేసింది. "తాజా నవీకరణ మొదటి అధికారిక యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్" డే బై డే "తో పాటు యానిమేటెడ్ స్టిక్కర్లను ఫఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోవచ్చు.  అలాగే డెస్క్‌ టాప్‌ నుండి యానిమేటెడ్ స్టిక్కర్లను క్రియేట్‌ చేసుకోవచ్చు.

గ్రూప్కాల్స్ : సిగ్నల్‌లో గ్రూప్ కాల్ ఫీచర్ ఉంది, కానీ ఐదుగురు పాల్గొనేందుకుమాత్రమే ఇప్పటిదాకా అనుమతి. ఈ పరిమితిని ప్రస్తుతం వాట్సాప్ మాదిరిగానే ఎనిమిదికి పెంచింది.

గ్రూప్ ఇన్‌వైట్‌ లింక్: గ్రూపులలో చేరేందుకు, ఇతర సిగ్నల్ వినియోగదారులను ఆహ్వానించడానికి సిగ్నల్ ఇప్పుడు గ్రూప్ ఇన్‌వైట్‌ లింక్ యాడ్‌ చేయడానికి అనుమతిస్తుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top