
మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ ఛైర్మన్ రంజన్ పాయ్ భార్య శ్రుతి పాయ్ బెంగళూరులోని జయమహల్ ఎక్స్‌టెన్షన్‌లో లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను రూ.64 కోట్లకు కొనుగోలు చేశారు. ఈమేరకు జాప్కీకి అందిన డాక్యుమెంట్లు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ రియల్టీ డీల్ ఆ ప్రాంతంలో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ లావాదేవీల్లో ఒకటిగా నిలిచింది. బెంగళూరు అల్ట్రా లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో పెరుగుతున్న మార్పును ఇది హైలైట్ చేస్తుంది.
ఒకప్పుడు స్టాండలోన్ బంగ్లాలు ఆధిపత్యం చెలాయించిన రూ.50 కోట్లకు పైగా ఉన్న ఈ విభాగంలో ఇప్పుడు ప్రీమియం అపార్ట్‌మెంట్లకు డిమాండ్ పెరుగుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ బెంగళూరులో అత్యంత డిమాండ్ ఉన్న రెసిడెన్షియల్ ఎన్‌క్లేవ్‌ల్లో ఒకటైన సవ్యసాచి సరయూలో శ్రుతి పాయ్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. 12,800 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా, 9,929 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో బాల్కనీలు, లిఫ్ట్ లాబీతో ఈ అపార్ట్‌మెంట్ విస్తరించి ఉంది. కార్పెట్ ఏరియాలో చదరపు అడుగుకు రూ.64,457, సూపర్ బిల్టప్ ఏరియాలో రూ.50,000 చొప్పున కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి: ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!
2024లో బెంగళూరుకు చెందిన క్వెస్ కార్ప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ ఐజాక్ బెంగళూరులోని బిలియనీర్ స్ట్రీట్ కోరమంగళ ప్రాంతంలో రూ.67.5 కోట్ల విలువైన 10,000 చదరపు అడుగుల ఆస్తిని కొనుగోలు చేశారు. మే నెలలో యూకేకు చెందిన మార్కెట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ సీఈఓ పరేష్ రాజా ఎంఐఏ ఎస్టేట్స్‌కు చెందిన 27 సమ్మిట్ ప్రాజెక్టులో లగ్జరీ పెంట్ హౌజ్‌ను రూ.54.38 కోట్లకు కొనుగోలు చేశారు. గత డిసెంబర్‌లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి బెంగళూరులోని కింగ్ ఫిషర్ టవర్స్‌లో రెండో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను రూ.50 కోట్లకు కొనుగోలు చేశారు.