
పెరుగుతున్న కోవిడ్-19 కేసుల ఆందోళనకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం( మార్చి 22) నష్టాల నెదుర్కొంటున్నాయి.
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి.దేశీయంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసుల ఆందోళనకు తోడు, అంతర్జాతీయ మార్కెట్లప్రతికూల సంకేతాలతో సోమవారం (మార్చి 22) కీలక సూచీలు భారీగా నష్టాలనెదుర్కొంటున్నాయి. ఆరంభంలోనే 350 క్షీణించిన సెన్సెక్స్ ప్రస్తుతం 281 పాయింట్లు నష్టంతో 49577వద్ద, 57 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 14686 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో,కేపిటల్ గూడ్స్ ఫ్లాట్‌గా ఉన్నాయ్. కన్జ్యూమర్ గూడ్స్, మెటల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మరోవైపు మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో, ఫార్మా షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. (జియోకు షాకిస్తున్న ఎయిర్‌టెల్)
టాటా మోటర్స్, హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టిసిఎస్ ఉండగా, బిపిసిఎల్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్‌ఫార్మా,బ్రిటానియా లాభాల్లోనే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటర్స్ హెచ్‌డిఎఫ్‌సి, ఎల్ అండ్ టి, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ స్వల్పలాభాల్లోనూ కొనసాగుతున్నాయి. కాగా దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఆందోళన రేపుతోంది. గత 24 గంటల్లో 46,951 తాజా కరోనావైరస్ కేసులునమోదయ్యాయి. ఒక రోజులో ఇంత పెద్ద స్థాయిలో కేసులు రావడం గత ఏడాది నవంబర్ 7 తరువాత ఇదే తొలిసారి. దీంతో మొత్తం 1,16,46,081 మంది కరోనా బారిన పడగా, మరణించినవారి సంఖ్య మొత్తం 1,59,97 కు చేరింది.