ఏడో రోజూ లాభాల రింగింగ్‌, ఐటీ జోరు

Sensex Nifty Gain For 7 Straight Days IT index top gainer - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో సెషన్‌లోనూ  కీలక సూచీలు లాభాలను కొనసాగిస్తున్నాయి.  గత రెండు సెషన్లలో  స్వల్ప  లాభాలకు పరిమితమైనా ప్రస్తుతం సెన్సెక్స్‌ 294 పాయింట్ల లాభంతో 58649 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు ఎగిసి 17476 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  ప్రధానంగా ఐటీ ఇండెక్స్‌ లాభాలు మార్కెట్‌కు ఊతమిస్తున్నాయి. 

హిందాల్కో, ఇన్ఫోసిస్‌, విప్రో, సిప్లీ, అదాని పోర్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉండగా, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, బ్రిటానియీ, టైటన్‌, నష్టపోతున్నాయి. బిస్కెట్ల తయారీ సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ త్రైమాసిక ఆర్థిక  ఫలితాల విడుదలకు ముందు 0.4 శాతం క్షీణించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top