
సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సూచనల మధ్య 2020-21 ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై 21) చివరి ట్రేడింగ్ రోజు బెంచ్‌మార్క్ సూచికలు సగం శాతానికి పైగా కుప్పకూలాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు పడి 49,750 స్థాయిని, నిఫ్టీ 14,750 మార్కును కోల్పోయింది. ఫార్మా తప్ప అన్ని రంగాలు నష్టపోతున్నాయి.నిఫ్టీ ఐటి ఇండెక్స్ 1 శాతం పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 424 కుప్పకూలి 49710 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 14732 వద్ద కొనసాగుతోంది. (బుల్ మళ్లీ రంకెలేసింది..)