ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాదారులకు సెబీ చెక్‌ | Sebi issues advertisement code for investment advisers, research analysts | Sakshi
Sakshi News home page

ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాదారులకు సెబీ చెక్‌

Apr 6 2023 5:00 AM | Updated on Apr 6 2023 5:00 AM

Sebi issues advertisement code for investment advisers, research analysts - Sakshi

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్లు(ఐఏలు), రీసెర్చ్‌ ఎనలిస్టు(ఆర్‌ఏ)లకు ప్రకటనల కోడ్‌ ను జారీ చేసింది. దీంతో ఇకపై తమ ప్రకటనల్లో.. నంబర్‌ వన్, టాప్‌ సలహాదారులు, టాప్‌ రీసెర్చ్‌ విశ్లేషకులు, లీడింగ్‌ సంస్థ వంటి అత్యుక్తులను వినియోగించేందుకు వీలుండదు. తమ ప్రకటనల్లో ఇకపై ఇలాంటి పదాలను నిషేధిస్తూ సెబీ అడ్వర్టయిజ్‌మెంట్‌ కోడ్‌ను విడుదల చేసింది.

అంతేకాకుండా క్లిష్టమైన భాషను సైతం వాడేందుకు అనుమతించరు. అయితే ఏదైనా అవార్డులవంటివి పొంది తే వీటి వివరాలు పొందుపరచేందుకు అవకాశముంటుంది. ఇందుకు సర్క్యులర్‌ను జారీ చేసింది. మే 1నుంచి అమలుకానున్న తాజా నిబంధనల ద్వారా ఐఏ, ఆర్‌ఏల నిబంధనలు మరింత పటిష్టంకానున్నాయి. అనుభవం, అవగాహనలేని ఇన్వెస్టర్ల ను తప్పుదారి పట్టించే అంచనాలు, స్టేట్‌మెంట్లు వంటివి ప్రకటనల్లో వినియోగించకూడదు.

ఇదేవిధంగా రాబడి(రిటర్న్‌) హామీలను ఇవ్వడానికి వీ లుండదు. ఐఏలు, ఆర్‌ఏల గత పనితీరును సైతం ప్రస్తావించేందుకు అనుమతించరు. సెబీ లోగోను వినియోగించరాదు. ఐఏ లేదా ఆర్‌ఏ జారీ చేసే ప్రకటనల్లో వాళ్ల పేర్లు, లోగో, కార్యాలయ చిరునామా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యలు వెల్లడించవలసి ఉంటుంది. సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. పెట్టుబడులు చేపట్టే ముందు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి అంటూ ప్రా మాణిక హెచ్చరికను జారీ చేయవలసి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement