న్యూ ఫండ్‌ ఆఫర్లకు కాల పరిమితులు | Sebi Board Decision: Time limits for new fund offers | Sakshi
Sakshi News home page

న్యూ ఫండ్‌ ఆఫర్లకు కాల పరిమితులు

Dec 23 2024 4:41 AM | Updated on Dec 23 2024 4:41 AM

Sebi Board Decision: Time limits for new fund offers

30 రోజుల్లోగా ఇన్వెస్ట్‌ చేయాలి

లేదంటే ఇన్వెస్టర్‌ తప్పుకోవచ్చు

సెబీ బోర్డులో నిర్ణయం

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కొత్త పథకాల రూపంలో (ఎన్‌ఎఫ్‌వోలు) సమీకరించే నిధులను ఇన్వెస్ట్‌ చేసేందుకు కాల పరిమితులను ప్రవేశపెట్టాలని సెబీ నిర్ణయించింది. అలాగే, అస్సెట్‌ మేనేజ్‌ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థలు) ఉద్యోగుల ప్రయోజనాలను, యూనిట్‌ హోల్డర్ల ప్రయోజనాలతో సమీకృతం చేసే నిబంధనలను సడలించాలన్న నిర్ణయానికొచి్చంది. దీనికితోడు అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు సంబంధించి స్ట్రెస్‌ టెస్ట్‌ ఫలితాలను ఇన్వెస్టర్లతో మరింత పారదర్శకంగా పంచుకోవాలని నిర్దేశించింది. వీటికి సంబంధించిన ప్రతిపాదనలకు బుధవారం నాటి సెబీ బోర్డులో ఆమోదం లభించింది. ఎన్‌ఎఫ్‌వో ద్వారా సమీకరించిన నిధులను ఏఎంసీలు 30 రోజుల్లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ఆలోపు ఇన్వెస్ట్‌ చేయకపోతే ఇన్వెస్టర్లు ఎలాంటి ఎగ్జిట్‌ లోడ్‌ లేకుండా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ‘‘30 రోజుల్లోపు ఇన్వెస్ట్‌ చేయడానికి వీలైనంత పెట్టుబడులనే ఓపెన్‌ ఎండెడ్‌ ఎన్‌ఎఫ్‌వోలో భాగంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ సమీకరించాలి. ఎందుకంటే ఇవి ఓపెన్‌ ఎండెడ్‌ పథకాలు కనుక ఇన్వెస్టర్లు కావాలంటే తర్వాత తిరిగి ఇన్వెస్ట్‌ చేసుకోగలరు’’అని సెబీ తెలిపింది.

ఏఎంసీ ఉద్యోగులకు సంబంధించి కార్యాచరణను సులభతరం చేయాలని నిర్ణయించింది. దీని కింద ఏఎంసీకి చెందిన నియమిత ఉద్యోగులు ఇన్వెస్ట్‌ చేయాల్సిన కనీస మొత్తాన్ని తగ్గించింది. ఏఎంసీ నుంచి తప్పుకున్న ఉద్యోగికి సంబంధించి పెట్టుబడులకు లాకిన్‌ పీరియడ్‌ను సైతం తగ్గించనున్నారు. సెబీ నిర్ణయాలను ట్రస్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో సందీప్‌ బగ్లా ఆహా్వనించారు. వేగంగా విస్తరిస్తున్న మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమకు యూనిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించే నిపుణులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement