SBI: వావ్‌​..అదరహో! ఎలైట్‌ క్లబ్‌లోకి ఎంట్రీ!

SBI crosses Rs 5trillion market cap joins elite club - Sakshi

రూ. 5 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ క్లబ్‌లోకి ఎస్‌బీఐ

మూడు నెలల్లో స్టాక్ 26 శాతం  జంప్‌

సాక్షి,ముంబై:  ప్రభుత్వ రంగ బ్యాంకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మార్కెట్‌ క్యాప్‌ ర్యాంకింగ్‌లో ఘనతను  సొంతం చేసుకుంది.  రూ. 5.03 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో, కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్‌లోఎస్‌బీఐ ఏడో స్థానాన్ని సాధించింది. దీంతో రూ.5 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన దేశంలో మూడో బ్యాంకుగా ఎస్‌బీఐ నిలిచింది. ఎస్‌బీఐ రూ. 5-ట్రిలియన్ మార్కును అధిగమించడం ఇదే తొలిసారి. షేర్ ధర సెప్టెంబర్ 14న రికార్డు స్థాయిలో రూ. 573ని  తాకింది.

బీఎస్‌ఈ డేటా ప్రకారం మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) తొలిసారిగా రూ. 5ట్రిలియన్ మార్కును తాకింది. బలహీనమైన మార్కెట్‌లో  ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉంది. గత మూడు నెలల్లో ఎ స్‌బీఐ షేరు 26 శాతం ఎగిసింది.  ఈ లిస్ట్‌లో ప్రయివేటు  బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ ప్లేస్‌లో ఉంది.  సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 8.42 ట్రిలియన్లు. అలాగే  ఐసిఐసిఐ బ్యాంక్  మార్కెట్ క్యాప్‌ రూ. 6.34 ట్రిలియన్లు గా ఉంది. అలాగే గత  మూడునెల​ల కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ 32 శాతం ర్యాలీ చేయగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 15 శాతం లాభపడింది.

ఈ జాబితాలోని ఇతర ఆరు కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 17.72 ట్రిలియన్), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ. 11.82 ట్రిలియన్), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (రూ. 8.42 ట్రిలియన్), ఇన్ఫోసిస్ లిమిటెడ్ (రూ. 6.5 ట్రిలియన్), ఐసిఐసిఐ బ్యాంక్ (రూ. 6.34 ట్రిలియన్) యూనిలివర్ (రూ. 6.08 ట్రిలియన్లు) ఉన్నాయి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top