
ముంబై: రిలయన్స్ డిజిటల్ ఇండియా ‘బూట్ అప్ ఇండియా’ పేరుతో అతిపెద్ద ల్యాప్‌టాప్ సేల్స్ ప్రకటించింది. వ్యాపారపరంగా మాత్రమే కాకుండా ‘నేటి విద్యార్థులను రేపటి అవకాశాలకు సన్నద్ధం చేయడం’ అనే గొప్ప సంకల్పంతో క్యాంపెన్ నిర్వహించనుంది.
సేల్స్‌లో భాగంగా ల్యాప్‌ట్యాప్‌లు, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్స్ ఉపకరణాలు తక్కువ ధరకే లభిస్తాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఒక కోటి రూపాయల ఉపకార వేతనాలు ఇవ్వనుంది. అలాగే 25 కార్లు, 40 బైకులు, 450 పైగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు గెలుచుకునే అవకాశం కలి్పస్తుంది.