ఇల్లు కోసం కొనలేదు.. హెరిటేజ్ ప్రాపర్టీగా!

Reliance clarifies on reports of Ambani family moving to London - Sakshi

ముంబై: భారతీయ అపరకుభేరుడు, అసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్‌ అంబానీ లండన్‌లోని బకింగ్‌ హామ్‌లో గల స్టోక్‌ పార్క్‌లో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ 300 ఎకరాల స్థలంలో ఉన్న 49 బెడ్‌ రూమ్‌లు ఉన్న ఇంటిని ప్రత్యేకంగా రూ.592 కోట్లతో  సొంతం చేసుకున్నట్లు మీడియాలో వస్తున్నాయి. లండన్‌లోని స్టోక్ పార్క్‌లో నివాసం ఉండనున్నట్లు ఒక వార్తాపత్రికలో ఇటీవలి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఆ కంపెనీ స్పందించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్‌ అంబానీకి, అతని కుటుంబానికి లండన్/ప్రపంచంలో మరెక్కడా నివసించాలనే ప్రణాళికలు లేవని స్పష్టం కంపెనీ చేసింది. ఇంకా, ఇటీవల స్టోక్ పార్క్ ఎస్టేట్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ అక్కడి ప్లానింగ్ మార్గదర్శకాలు, స్థానిక నిబంధనలను పూర్తిగా పాటిస్తూనే.. హెరిటేజ్ ప్రాపర్టీని కోనుగోలు చేసినట్లు పేర్కొంది. దానిని ప్రధాన గోల్ఫింగ్ కేంద్రంగా, స్పోర్టింగ్ రిసార్ట్‌గా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో భారతదేశ ప్రఖ్యాత హాస్పిటాలిటీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తునట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది.

(చదవండి: ఎన్‌ఎఫ్‌టీ అమ్మకాల్లో అమితాబ్ బచ్చన్ రికార్డు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top