బడ్జెట్ ధరలో రియల్‌మీ క్యూ2 5జీ స్మార్ట్‌ఫోన్లు 

Realme Q2 Pro, Q2, Q2i launched  - Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ  బడ్జెట్ ధరలో మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ ఫోన్లతో ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా 5 జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. రియల్‌మీ క్యూ2, రియల్‌మీ క్యూ2 ప్రో, రియల్‌మీ క్యూ2ఐ అనే మూడు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసింది. రియల్‌మీ క్యూ, రియల్‌మీ  క్యూ2 ప్రోలు రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలోనూ, రియల్‌మీ క్యూ2ఐలో ఒక్క స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్లు త్వరలో ఇండియా మార్కెట్లోకి రానున్నాయి.

రియల్‌మీ క్యూ2 ఫీచర్లు
6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,
అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10 
48+8+2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 
16  ఎంపీ   సెల్ఫీ కెమెరా,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

రియల్‌మీ క్యూ2 ప్రో ఫీచర్లు
6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే,
అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10 
48+8+2 మెగా పిక్సెల్  ట్రిపుల్ రియర్ కెమెరా 
16 ఎంపీ  సెల్ఫీ కెమెరా
4300 ఎంఏహెచ్ బ్యాటరీ

రియల్‌మీ క్యూ2ఐ ఫీచర్లు
6.5 అంగుళాల డిస్ ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్,
13+2+2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా సెటప్
ఆండ్రాయిడ్ 10 
8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఇక  ధరల విషయానికి వస్తే
రియల్‌మీ క్యూ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,200 
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,200
రియల్‌మీ క్యూ2 ప్రో 
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 రూ.19,600 
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,800గా ఉంది. 
రియల్‌మీ క్యూ2ఐ
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.13,000 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top