వారంలో వెయ్యి కోట్ల విక్రయాలు

This Real Estate Company Sales One Thousand Crore Property in One Week - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే రూ.1,000 కోట్ల విక్రయాలను పూర్తి చేసినట్లు గుర్గావ్‌కు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఎం3ఎం ఇండియా ప్రకటించింది. ఎన్‌సీఆర్‌లోని నేషనల్‌ పెరిఫెరల్‌ రోడ్‌ సెక్టార్‌ 89లో నిర్మిస్తున్న ఎం3ఎం సౌలిట్యూడ్‌ ప్రాజెక్ట్‌లు ఈ అమ్మకాలు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

వెయ్యి యూనిట్ల ఈ ప్రాజెక్ట్‌ను 2023 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించింది. 1,100 చ.అ. నుంచి 1,400 చ.అ. మధ్య 2, 3 బీహెచ్‌కే యూనిట్లను నిర్మిస్తోంది. ధరలు రూ.70–90 లక్షల మధ్య ఉన్నాయని కంపెనీ డైరెక్టర్‌ పంకజ్‌ భన్సాల్‌ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య కాలంలో రూ.3,034 కోట్ల విక్రయాలను చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో నిర్మాణంలో ఉన్న నివాస ప్రాజెక్ట్‌లలో రూ.1,450 కోట్లు, కమర్షియల్‌లో రూ.835 కోట్లు, పూర్తయిన ప్రాజెక్ట్‌లలో రూ.749 కోట్ల అమ్మకాలు చేశామన్నారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top