
బ్యాంక్‌లకు 15 రోజుల గడువు
ఆలస్యం చేస్తే పరిహారం చెల్లించాలి
ఆర్‌బీఐ కొత్త నిబంధనలు
ముంబై: మరణించిన వ్యక్తులకు సంబంధించి డిపాజిట్ ఖాతాలు, లాకర్ల క్లెయిమ్‌లను 15 రోజుల్లోగా పరిష్కరించాలంటూ ఆర్‌బీఐ కొత్త నిబంధనలు ప్రకటించింది. ఆలస్యం చేస్తే నామినీలకు పరిహారం చెల్లించాలని పేర్కొంది. మరణించిన వ్యక్తుల ఖాతాల క్లెయిమ్‌ల విషయంలో బ్యాంకులు భిన్నమైన పద్ధతులను అనుసరిస్తుండడంతో సేవల నాణ్యతను పెంచే దిశగా ఆర్‌బీఐ ఏకరూప నిబంధనలు తీసుకొచి్చంది.
వీటిని సాధ్యమైనంత త్వరగా, 2026 మార్చి 31లోపు అమలు చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. నామినేషన్ లేదా సరై్వవర్‌షిప్ తో డిపాజిట్ ఖాతా తెరిచినట్టయితే.. సంబంధిత డిపాజిటర్ మరణానంతరం నామినీ లేదా సర్వైవర్‌షిప్‌కు బ్యాలన్స్‌ను బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతాలకు నామినీ లేదా సర్వైవర్‌షిప్ క్లాజు లేకపోతే.. నిర్దేశిత మొత్తం లోపు బ్యాలన్స్ ఉన్న సందర్భాల్లో సులభతర చెల్లింపుల నిబంధనలు పాటించాలని ఆర్‌బీఐ పేర్కొంది.
కోఆపరేటివ్ బ్యాంకులకు ఈ పరిమితిని రూ.5 లక్షలు, ఇతర బ్యాంక్‌లకు ఇది రూ.15 లక్షలుగా నిర్ణయించింది. అంటే మరణించిన వ్యక్తి ఖాతాలకు సంబంధించిన బ్యాలన్స్ ఇంతకులోపు ఉండి, నామినేషన్ లేదా సర్వైవర్‌షిప్ నమోదు లేని సందర్భాల్లో బ్యాంకులు వారసులకు సులభతర క్లెయిమ్‌కు వీలు కల్పించాల్సి ఉంటుంది. ఈ పరిమితికి మించి బ్యాలన్స్ ఉంటే అప్పుడు సక్సెషన్ సరి్టఫికెట్ లేదా లీగల్ హైయిర్ (చట్టబద్ధ వారసులుగా ధ్రువీకరణ) సర్టిఫికెట్‌ను బ్యాంక్‌లు అడగొచ్చు. క్లెయిమ్ నమోదు చేసి, డాక్యుమెంట్లు సమరి్పంచిన నాటి నుంచి 15 రోజుల్లో బ్యాంకులకు పరిష్కరించాలి. జాప్యానికి కారణాలు బ్యాంకుల వైపు ఉంటే, డిపాజిట్ ఖాతాలోని బ్యాలన్స్‌పై బ్యాంక్ రేటుకు అదనంగా 4% చొప్పున వార్షిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. లాకర్‌కు సంబంధించి క్లెయిమ్‌ను జాప్యం చేస్తే రోజుకు రూ.5,000 చొప్పున చెల్లించాలని ఆర్‌బీఐ పేర్కొంది.