
ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుడు నగేష్ కుమార్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) 6.5 శాతానికి పైన వృద్ధిని సాధించే విషయంలో ఎలాంటి సవాళ్లు లేవని ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుడు నగేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచంలో అన్ని ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్ ఆశాకిరణంలా కొనసాగుతోందన్నారు. ‘‘నిజానికి మూడింట ఒకవంతుకు పైగా ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన రుణ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలు ఒత్తిళ్లను, అధిక ధరలు, ఆర్థిక మందగమనంతో సతమతం అవుతున్నాయి.
కానీ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా దేశీ వినియోగం, దేశీ పెట్టుబడుల ఆధారితంగా నడుస్తోంది. ఎగుమతులపై ఆధారపడడం తక్కువ. కనుక 6.5 శాతం కంటే అధిక వృద్ధి సాధించే విషయంలో నాకు ఎలాంటి సవాళ్లు కనిపించడం లేదు’’అని కుమార్ వివరించారు. ఇదే వేగం కొనసాగుతుందంటూ రానున్న సంవత్సరాల్లో 7–7.5 శాతం వృద్ధి రేటును చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని రేట్ల కోతకు అవకాశం ఉంటుందా? అన్న ప్రశ్నకు.. కేవలం ద్రవ్యోల్బణం నియంత్రణ కాకుండా ఇతర స్థూల ఆర్థిక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని నగేష్ కుమార్ బదులిచ్చారు.
యూఎస్‌తో ఒప్పందం ప్రయోజనకరమే
అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం సాకారమైతే కారి్మక ఆధారిత విస్తృతమైన అమెరికా మార్కెట్‌లో భారత్‌కు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని నగేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. మనదగ్గర పెద్ద ఎత్తున కారి్మక వనరులు ఉన్నందున భారత్ పోటీతత్వం పెరుగుతుందన్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ విషయంలో అమెరికాకు అవకాశాలు కలి్పంచడం పట్ల భారత్‌కు కొన్ని ఆందోళనలు ఉన్నట్టు ప్రస్తావించారు.