ఆర్‌బీఐ కీలక సమావేశాలు ప్రారంభం | RBI likely to maintain status quo in its monetary policy on Dec 4 | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ కీలక సమావేశాలు ప్రారంభం

Dec 3 2020 5:40 AM | Updated on Dec 3 2020 5:40 AM

RBI likely to maintain status quo in its monetary policy on Dec 4 - Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల కీలక సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఈ సమావేశం విధాన నిర్ణయాలు వెల్లడవుతాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో  బ్యాంకులకు తానిచ్చే రుణాలపై  వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ‡  ఇక 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు అంచనాలను ఎంపీసీ  తగ్గించే అవకాశం ఉంది.  అలాగే వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మరింత మెరుగుపడ్డానికి తగిన చర్యలనూ ప్రకటించవచ్చని అంచనా. 

Advertisement
 
Advertisement
Advertisement