రామ్‌కో సిమెంట్స్‌కు సీఎస్‌ఆర్‌బాక్స్‌ ఇంపాక్ట్‌ అవార్డులు | Ramco Cements Gets Csrbox Impact Awards | Sakshi
Sakshi News home page

రామ్‌కో సిమెంట్స్‌కు సీఎస్‌ఆర్‌బాక్స్‌ ఇంపాక్ట్‌ అవార్డులు

Dec 2 2022 1:10 PM | Updated on Dec 2 2022 1:26 PM

Ramco Cements Gets Csrbox Impact Awards - Sakshi

హైదరాబాద్‌: రామ్‌కో సిమెంట్స్‌ కంపెనీ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద రెండు విభాగాల్లో సీఎస్‌ఆర్‌బాక్స్‌ ఇంపాక్ట్‌ అవార్డులు దక్కించుకుంది. అరియలూర్‌ ప్లాంట్‌కు వాటర్‌ శానిటైషన్‌ అండ్‌ హైజీన్‌(వాష్‌) అవార్డు, ఆర్‌ఆర్‌ నగర్‌ ప్లాంట్‌కు ఎంప్లాయి వాలంటీరింగ్‌ ఇనీషియేటివ్‌ అవార్డులు లభించాయి. సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల ద్వారా సమాజంలో మెరుగైన ఫలితాలను సాధించే కంపెనీలను సీఎస్‌ఆర్‌బాక్స్‌ ఈ అవార్డుల ద్వారా ప్రోత్సహిస్తుంటుంది.

సీఎస్‌ఆర్‌ను నిర్భంధంగా కాకుండా ఓ బాధ్యతగా రామ్‌కో సిమెంట్స్‌ భావిస్తుందని సీఈవో ఏవీ ధర్మకృష్ణన్‌ తెలిపారు. గత 60 ఏళ్లుగా కంపెనీ స్థాపించిన నాటి నుంచి సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement