Zomato Stock Crash Prediction: జొమాటో షేర్లలో అల్లకల్లోలం, రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా మాట వింటే బాగుండేదే!

Rakesh Jhunjhunwala Zomato Stock Crashed Prediction Viral On Social Media - Sakshi

వారెన్‌ బఫెట్‌ ఆఫ్‌ ఇండియా రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా చేసిన ప్రిడిక్షన్‌ నిజమైంది. ఏడాది క్రితమే జొమాటో షేర్ల పతనం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో మదుపర్లను జొమాటో షేర్లను కొనవద్దని చెబితే వారు నన్ను ఫూల్‌ అంటారని వ్యాఖ్యానించారు.  
 
దేశీయ స్టాక్‌ మార్కెట్లన్నీ మంచి జోరుమీదున్న సమయంలో హఠాత్తుగా ‘జొమాటో’ షేర్లు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం ట్రేడింగ్‌ జరిగే 3గంటల సమయానికి జొమాటో షేర్‌ ధర రూ.45.90గా ఉండగా.. జులై 23,2021 నుంచి ఆ సంస్థ షేర్లు 61.33శాతం పతనమయ్యాయి.

అదే సమయంలో గతేడాది స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో లిస్టింగ్‌కు వెళ్లిన ఇతర సంస్థల షేర్లు జోరుమీద ఉండడం..పేటీఎం, నైకా షేర్లు, జొమాటో షేర్లు భారీగా పతనం కావడంతో మదపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ తరుణంలో గతేడాది జరిగిన 'ఇండియా టుడే కన్లక్లేవ్‌'లో పాల్గొన్న ఝున్‌ఝున్‌ వాలా చేసిన వ్యాఖ్యల్ని మదుపర్లు గుర్తు చేసుకుంటున్నారు.

ఇండియా టుడే కార్యక్రమంలో..జొమాటోతో సహా కొత్తగా లిస్టైన ఇతర కంపెనీల వాల్యుయేషన్‌పై ఝున్‌ఝున్‌ వాలా ఆందోళన వ్యక్తం చేశారు. జొమాటో స్టాక్స్‌ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో వివరించారు. ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశారు.హెచ్చరించారు. "ఈ రోజు నేను జొమాటో షేర్‌ని కొనవద్దు అని చెబితే, ప్రజలు నన్ను ఫూల్ అంటారు" అని వ్యాఖ్యానించారు.  

కారణం అదేనా 
గత ఏడాది జూలై 23న ఐపీవోకి వెళ్లిన జొమాటో ప్రమోటర్లు, ఉద్యోగులు, ఇతర పెట్టుబడిదారులకు ఈ ఏడాది జులై 23కి లాక్‌ ఇన్‌ పిరియడ్‌ ముగిసింది. జూలై 25 ,జూలై 26 ఈ రెండు రోజుల్లో స్టాక్ 20 శాతం భారీగా పడిపోయింది. నాటి నుంచి ఎన్‌ఎస్‌ఈలో జొమాటో షేర్ల పతనం కొనసాగుతుంది. దీంతో మదుపర్లు తమ పెట్టుబడులపై ఆందోళన చెందుతుండగా..నాడు జొమాటో స్టాక్స్‌ విషయంలో రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా మాట విని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top