పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త!

 Post Office Savings Scheme Withdrawal Rule Revised - Sakshi

ఇండియా పోస్ట్ తన పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త అందించింది. తన ఖాతాదారుల డైలీ విత్ డ్రా లిమిట్ ను పెంచింది. ఇండియా పోస్ట్ తీసుకోచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఖాతాదారులు గ్రామీణ డాక్ సేవ శాఖలో ఒక రోజులో రూ.20,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతకుముందు విత్ డ్రా లిమిట్ రూ.5,000గా ఉండేది. ఇండియా పోస్ట్ తన కొత్త మార్గదర్శకాలలో పేర్కొన్న ప్రకారం ఏ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం) ఒక రోజులో ఒక ఖాతాలో రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ గా స్వీకరించరాదని పేర్కొంది. అంటే ఒక ఖాతా ద్వారా రూ.50,000 కంటే ఎక్కువ నగదు లావాదేవీలు ఒక రోజులో చేయలేము.

పీపీఎఫ్, కెవిపీ, ఎన్ఎస్ సీ కొత్త రూల్స్
ఇండియా పోస్ట్ యొక్క కొత్త నిబంధనల ప్రకారం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్ సీఎస్ఎస్), మంత్లీ ఇన్ కమ్ స్కీం (ఎంఐఎస్), కిసాన్ వికాస్ పాత్రా(కెవిపి), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్ సీ) స్కీంల కోసం డిపాజిట్ లేదా విత్ డ్రా చెక్కులు ద్వారా చేయవచ్చు.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీం: కనీస బ్యాలెన్స్
పోస్టాఫీసు పొదుపు పథకంపై 4% వడ్డీ లభిస్తుంది. తపాలా కార్యాలయ పొదుపు పథకం ఖాతాలో కనీసం రూ.500 బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. అయితే కనీస బ్యాలెన్స్ రూ.500 కంటే తక్కువగా ఉంటే ఖాతా నిర్వహణ చార్జీల కింద జరిమానాగా రూ.100 వసూలు చేస్తారు. 

పోస్టాఫీసు పొదుపు పథకాలు: వడ్డీ రేటు

  • పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా: 4%
  • ఏడాది వరకు టీడీ ఖాతా: 5.5%
  • 2 ఏళ్ల వరకు టీడీ ఖాతా: 5.5%
  • 5 ఏళ్ల వరకు టీడీ ఖాతా: 6.7%
  • 5 ఏళ్ల ఆర్ డి: 5.8%
  • సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం: 7.4%
  • పీపీఎఫ్ పొదుపు పథకం: 7.1%
  • కిసాన్ వికాస్ పాత్ర: 6.9%
  • సుకన్య సమృద్ధి ఖాతాదారులకు: 7.6%
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top