వాహనదారులకు భారీ షాక్‌..మళ్లీ పెరిగిన పెట్రోల్‌,డీజిల్‌ ధరలు!

Petrol, diesel Rates Rise By 80 Paise Per Litre For Second Straight Day - Sakshi

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తరువాత వాహనదారులపై పెట్రో బాదుడు షురూ అయ్యింది. చివరి సారిగా డీజిల్‌,పెట్రోల్‌ ధరలు గతేడాది నవంబర్ 4వరకు పెరిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పుడు మళ్లీ పెట్రోల్‌ ధరల పెంపు ప్రారంభమైంది. దీంతో బుధవారం లీటర్‌ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 84పైసలు పెరిగాయి. 

మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. అయితే రోజురోజుకు చమురు సంస్థలు నష్టాలు పెరుగుతుండడంతో పెట్రో ధరల పెంపు అనివార్యమైందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

దేశంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధరూ.110గా ఉండగా డీజిల్‌ ధర రూ.96.36 పైసలుగా ఉంది.

గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.08 ఉండగా డీజిల్‌ ధర రూ.98.10పైసలుగా ఉంది.

విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.99 ఉండగా డీజిల్‌ ధర రూ.97.90పైసలుగా ఉంది.

న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.21 ఉండగా లీటర్‌ డీజిల్‌ ధర రూ.87.47పైసలుగా ఉంది.

ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.82పైసలు ఉండగా డీజిల్‌ ధర రూ.95.00పైసలుగా ఉంది.

కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.51 ఉండగా డీజిల్‌ ధర రూ.90.62పైసలుగా ఉంది.

చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.16 ఉండగా డీజిల్‌ ధర రూ.92.19పైసలుగా ఉంది.

బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.42 ఉండగా డీజిల్‌ ధర రూ.85.80పైసలుగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top