పెరిగిన ఇంధన ధరలు: ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు! | Petrol and Diesel Prices Hiked, Know The Top Highest Mileage Cars in India | Sakshi
Sakshi News home page

పెరిగిన ఇంధన ధరలు: ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు!

May 15 2026 4:48 PM | Updated on May 15 2026 5:04 PM

Petrol and Diesel Prices Hiked, Know The Top Highest Mileage Cars in India

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మూడు రూపాయలు పెరిగింది. అమెరికా - ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఇంధన ధరల పెంపును ప్రకటించారు. అయితే.. కొత్త కార్లు కొనేవారికి ఇంధన ధరల పెంపు భారమే అయినప్పటికీ.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఒకింత ఉపశమనం కలిగిస్తాయి. ఈ కథనంలో అలాంటి కార్లను గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి విక్టోరిస్
మారుతి సుజుకి విక్టోరిస్ అనేది.. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నుంచి వచ్చిన రెండవ మిడ్‌సైజ్ ఎస్యూవీ. ఇది పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో పనిచేస్తుంది. కాబట్టి ఈ కారు లీటరుకు 28.65 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 16.38 లక్షల నుంచి రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారు దేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం గల కార్లలో ఒకటి. ఇది పెట్రోల్-హైబ్రిడ్ సెటప్‌తో 27.97 కి.మీ/లీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర దేశీయ విఫణిలో రూ. 16.72 లక్షల నుంచి రూ. 20.19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది.

హోండా సిటీ eHEV
రెండు దశాబ్దాలకు పైగా మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా సిటీ eHEV ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్‌లలో ఒకటి. ఇది 27.26 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇండియన్ మార్కెట్లో దీని ధర రూ.20 లక్షలు (ఎక్స్ షోరూమ్).

మారుతి సుజుకి సెలెరియో
ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో మారుతి సుజుకి సెలెరియో కూడా ఒకటి. ఈ హ్యాచ్‌బ్యాక్ లీటరుకు 26 కిలోమీటర్ల వరకు మైలేజీని కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ. 5.61 లక్షల నుంచి రూ. 6.73 లక్షల మధ్య ఉంటుంది. ఇది మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న మోడల్ కూడా.

మారుతి సుజుకి స్విఫ్ట్
2005లో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన మారుతి సుజుకి స్విఫ్ట్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఇది లీటరుకు 25.75 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ మైలేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ యూనిట్ మాత్రమే అందిస్తుంది. దీని ధర రూ.రూ.7.04 లక్షల నుంచి రూ. 8.65 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.

ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. టోల్ ప్లాజాలు మాయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement