వృద్ధులకు, పింఛనుదారులకు గుడ్ న్యూస్!

Pensioners, Senior Citizens Can Get Life Certificate From Nearest Post Office - Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ కేంద్రాల ద్వారా వృద్దులు, పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాన్ సేవలను పొందవచ్చు అని ప్రకటించింది. తాజా నిర్ణయంతో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు ఇద్దరికీ భారీ ఉపశమనం లభించింది. సాంకేతికపరిజ్ఞానం లేని వృద్దులు తమ లైఫ్ సర్టిఫికేట్ పొందడం కోసం వారు బ్యాంకులను సందర్శించాల్సి వచ్చేది. అక్కడ వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లయింది. 

"ఇకపై వృద్ధులు సులభంగా జీవన ప్రమాణ సేవలను పొందవచ్చు. సమీప పోస్టాఫీసులో ఉండే సీఎస్సీ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి" అని పోస్టల్ విభాగం ట్వీట్ చేసింది. తాజా నిర్ణయం వల్ల కేంద్ర, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యుటీలు) 60 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ది జీవన్ ప్రమాన్ అధికారిక వెబ్ సైట్ ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని పొందడానికి పెన్షన్ తీసుకునే వ్యక్తి ప్రభుత్వం చేత గుర్తించబడిన ఏజెన్సీ ముందు హాజరు కావాలి లేదా పింఛనుదారుడు ఇంతకు ముందు పనిచేసిన అథారిటీ ద్వారా జారీ చేయబడ్డ లైఫ్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి.  తర్వాత దానిని ఏజెన్సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడుఆ వారు లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి సమీప పోస్టాఫీసు కేంద్రాన్ని సందర్శించవచ్చు. అలాగే, మీ దగ్గరలో గనుక జీవన్ ప్రమాన్ కేంద్రాలు ఉంటే దాని ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఈ కేంద్రాలలో వారు మీ ఆధార్ బయో మెట్రిక్ తీసుకుంటారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top