ఓయో ఐపీవో@ రూ. 6,650 కోట్లు | OYO Parent Prism Files Rs 6650 Crore IPO Papers With SEBI | Sakshi
Sakshi News home page

ఓయో ఐపీవో@ రూ. 6,650 కోట్లు

Jul 1 2026 4:48 AM | Updated on Jul 1 2026 4:48 AM

OYO Parent Prism Files Rs 6650 Crore IPO Papers With SEBI

న్యూఢిల్లీ: ఓయో మాతృ సంస్థ ప్రిజమ్‌ .. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించి అప్‌డేట్‌ చేసిన ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇది పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఉండనుంది.

ప్రీ–ఐపీవో ప్లేస్‌మెంట్‌ కింద రూ. 1,330 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు, ఒకవేళ ఇది విజయవంతమైతే ఆ మేరకు తాజా షేర్ల జారీ పరిమాణం తగ్గనున్నట్లు సంస్థ తెలిపింది. సంస్థ వ్యవస్థాపకుడు రితేష్‌ అగర్వాల్‌ (30.52% వాటా)తో పాటు సాఫ్ట్‌బ్యాంక్‌  (40.04% వాటా)తదితర షేర్‌హోల్డర్లు తమ వాటాలను విక్రయించడం లేదని వివరించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement