నెట్‌వర్క్‌ కంపెనీలకు ప్రధాని మోడీ పుష్‌ | Optical fiber network shares zoom | Sakshi
Sakshi News home page

నెట్‌వర్క్‌ కంపెనీలకు ప్రధాని మోడీ పుష్‌

Aug 17 2020 1:17 PM | Updated on Aug 17 2020 1:17 PM

Optical fiber network shares zoom - Sakshi

బ్రాడ్‌బ్యాండ్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ తదితర పలు నెట్‌వర్క్‌ కంపెనీలకు ప్రధాని మోడీ ప్రసంగం జోష్‌నిస్తోంది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగించిన ప్రధాని మోడీ.. రానున్న 1,000 రోజుల్లో దేశంలోని ప్రతీ గ్రామాన్నీ ఆప్టికల్‌ ఫైబర్‌తో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఐదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యాలను కల్పించినట్లు తెలియజేశారు. భారత్‌నెట్‌ పేరుతో ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆప్ఠికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌కు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. దీంతో నెట్‌వర్క్‌ సంబంధిత పలు లిస్టెండ్‌ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

జోరుగా హుషారుగా
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం పలు నెట్‌వర్క్‌ ఆధారిత కంపెనీల షేర్లు జోరు చూపుతున్నాయి. స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ 9 శాతం దూసుకెళ్లి రూ. 142ను తాకగా..  పాలీక్యాబ్‌ ఇండియా 3 శాతం ఎగసిరూ. 900కు చేరింది. ఈ బాటలో  బిర్లా కేబుల్స్‌ 7.2 శాతం జంప్‌చేసి రూ. 57 వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో కార్డ్స్‌ కేబుల్‌ ఇండస్ట్రీస్‌, ఫినొలెక్స్‌ కేబుల్స్‌, అక్ష్‌ ఆప్టిఫైబర్‌, ఐటీఐ, కేఈఐ ఇండస్ట్రీస్‌, వింధ్యా టెలీలింక్స్‌, డెల్టన్‌ కేబుల్స్‌, పారామౌంట్‌ కమ్యూనికేషన్స్‌, యూనివర్శల్‌ కేబుల్స్‌ తదితరాలు 11-2 శాతం మధ్య లాభాలతో హల్‌చల్‌ చేస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement