ఎలక్ట్రికల్‌ వెహికల్‌ చార్జింగ్‌ సదుపాయాలపై నీతి ఆయోగ్‌ సలహాలు!

Niti Aayog Releases Handbook To For Electric Vehicle Charging Infrastructure Implementation - Sakshi

న్యూఢిల్లీ: విద్యుత్‌తో నడిచే వాహనాలకు చార్జింగ్‌ సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి సహాయకారిగా ఉండే ఒక హ్యాండ్‌బుక్‌ను నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. విధానాల రూపకల్పన విషయంలో రాష్ట్రాలు, స్థానిక పాలక మండళ్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నీతి ఆయోగ్‌ తెలిపింది.

ప్రణాళికల రూపకల్పన, ఈవీ చార్జింగ్‌ సుదుపాయాల ఏర్పాటు విషయంలో సమగ్ర విధానాన్ని అనుసరించేందుకు కావాల్సిన సమాచారం ఇందులో ఉన్నట్టు తెలిపింది. వివిధ సంస్థలు, శాఖలతో కలిసి నీతి ఆయోగ్‌ సంయుక్తంగా ఈ హ్యాండ్‌బుక్‌ను రూపొందించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top