
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం కింద బ్యాంక్ ఇఫ్ ఇండియా కస్టమర్లకు న్యూ ఇండియా అష్యూరెన్స్ బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది.
న్యూ ఇండియాకు చెందిన హెల్త్ ఇన్సూరెన్స్, మోటారు, వ్యక్తిగత ప్రమాద, హోమ్, వాణిజ్య ఇన్సూరెన్స్ ఉత్పత్తులను బీవోఐ కస్టమర్లు సులభంగా పొందొచ్చు. సమగ్రమైన బీమా ఉత్పత్తులను అందించేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుందని బ్యాంక్ ఇఫ్ ఇండియా ఎండీ, సీఈవో రజనీష్ కర్ణాటక్ తెలిపారు.
ఈ ఒప్పందంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బీమా ఉత్పత్తులు చేరువ అవుతాయని, నాణ్యమైన సేవలు, రక్షణ అందుతాయని న్యూ ఇండియా అష్యూరెన్స్ చైర్మన్, ఎండీ గిరిజా సుబ్రమణ్యం పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 5,200 శాఖలున్నాయి.