Netflix Password Sharing: ఆ కక్కుర్తితో వందల కోట్ల హాంఫట్,నెట్‌ఫ్లిక్స్‌ వినియోగదారులారా బుద్ధొచ్చింది!

Netflix Password Sharing Business Is Coming To An End Soon - Sakshi

కక్కుర్తే ప్రముఖ స్ట్రీమింగ్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ కొంపముంచినట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు ఇచ్చిన భారీషాక్‌కు కళ్లు తెరిచినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాలో కార్యకలాపాలు నిలిపివేస్తూ ప్రకటించింది. ఆ ప్రకటనతో పోగొట్టుకున్న ఆదాయాన్ని..తిరిగి యూజర్ల నుంచి రాబట్టుకునేందుకు పాస్‌వర్డ్‌ షేరింగ్‌ ఛార్జస్‌ను తెరపైకి తెచ్చింది.ఈ నిర్ణయం నెట్‌ఫ్లిక్స్‌కు బెడిసికొట్టింది. సబ్‌స్క్రైబర‍్లు కోల్పోవడం,ఆదాయం పడిపోవడంతో తిరిగి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.  

వందల కోట్ల సంపద హాంఫట్
మార్చి 3న రష్యాలో కార్య కాలాపాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వెను వెంటనే నెట్‌ఫ్లిక్స్‌ కొన్ని దేశాల్లో యూజర్లు తమ అకౌంట్‌ పాస్‌వర్డ్‌లను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్‌ చేస్తే అదనంగా వసూలు చేస్తామంటూ ఇన్‌ డైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చింది. దీంతో యూజర్లు భారీగా పడిపోయారు. మరోవైపు రష్యాలో ఆగిన కార్యకలాపాలతో 7లక్షల మందిని వినియోగదారుల్ని కోల్పోయింది. ఈ ఏడాది విడుదలైన మొదటి త్రైమాసికంలో(జనవరి,ఫిబ్రవరి, మార్చి) 200,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయినట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. మార్కెట్ విలువ నుండి సుమారు $55 బిలియన్ల ఆదాయం తగ్గిపోయింది.
   

కేవలం రెండు సెషన్లలో నెట్‌ఫ్లిక్స్ స్టాక్ దాని సబ్‌స్క్రైబర్ బేస్ తగ్గడంతో దాని మార్కెట్ విలువలో 40 శాతం కోల్పోయింది. ఈ బుధవారం (18వ తేదీ) 35 శాతం పతనం తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ ఇన్వెస్టర్లకు నష్టభయం పట్టుకుంది. ఆ భయం అలాగే కంటిన్యూ కావడంతో గురువారం మరో 4 శాతం పడిపోయాయి. దీంతో ఈ స్ట్రీమింగ్ దిగ్గజం 2022లో ఇప్పటివరకు దాని విలువలో మూడింట రెండు వంతులను కోల్పోయింది. ఇలా కంపెనీ పనితీరు, అనేక సందేహాలతో గత 4 నెలల్లో 150 బిలియన్‌ డాలర్ల (ఇండియన్‌ కనెన్సీలో రూ.11,47,13,25,000.00) మేర షేర్‌హోల్డర్ల సంపద కరిగిపోవడంతో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రకంపనలు సృష్టించాయి.  

సరికొత్త ప్లాన్‌
కోల్పోయిన సంపదను, పోగొట్టుకున్న సబ్‌ స్క్రైబర్లను తిరిగి దక్కించుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌ సరికొత్త ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నెట్‌ ఫ్లిక్స్‌ సీఓఓ రీడ్ హాస్టింగ్స్ మాట్లాడుతూ..పదేళ్లలోనే మొదటిసారిగా సబ్‌ స్క్రైబర్లను భారీగా కోల్పోయింది. కోల్పోయిన సబ్‌ స్క్రైబర్లను తిరిగి పొందేందుకు ఇప్పటికే ఉన్న చిలీ, కోస్టారికా, పెరూ దేశాల్లో పాస్‌వర్డ్‌ షేర్‌ చేస‍్తే అదనంగా వసూలు చేస్తుంది. ఆ దేశాలతో పాటు మిగిలిన దేశాల్లో ప్రకటించిన 'నెట్‌ ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్‌ బిజినెస్‌' ప్రకటనను తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకు బదులుగా యాడ్ సపోర్టెడ్ టైర్‌ను ప్రవేశపెట్టి, సబ్‌స్క్రిప్షన్‌ ధరల్ని తగ్గించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఆ సంస్థకు భారీ ఊరట కలగనుందని, కోల్పోయిన సబ్‌స్క్రైబర్‌లను తిరిగి పొందే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి👉 యూజర్లకు నెట్‌ఫ్లిక్స్‌ భారీ షాక్‌! అది ఏంటంటే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top