
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణపొందిన ఆహార, పానీయాల దిగ్గజం 'నెస్లే' (Nestle).. రాబోయే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 16,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు గురువారం ప్రకటించింది. సెప్టెంబర్ 2025 ప్రారంభంలో బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఈఓ ఫిలిప్ నవ్రాటిల్ ఆధ్వర్యంలో కంపెనీ పరివర్తనను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
"ప్రపంచం మారుతోంది, నెస్లే కూడా వేగంగా మారాలి" అని సీఈఓ నవ్రాటిల్ ఒక ప్రకటనలో అన్నారు. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని.. దీని ప్రకారమే ఉద్యోగాల కోతలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వేలాది ఉద్యోగాల కోత!.. తాజాగా అమెజాన్
నెస్లే తొలగించనున్న మొత్తం 16,000 మంది ఉద్యోగులలో.. సుమారు 12,000 మంది వైట్ కాలర్ ఉద్యోగులు, మిగిలిన 4,000 మంది ఉత్పత్తి, సరఫరా గొలుసులు సంబంధించిన ఉద్యోగులు ఉండనున్నారు. ఉద్యోగాల తొలగింపులు తరువాత.. కంపెనీ పొదుపు లక్ష్యం 3 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా సంస్థ నిర్ణయించుకుంది.