సంచలనం, భారత్‌లోకి మొదటి 200 మెగా పిక్సల్‌ కెమెరా ఫోన్.. గ్రాండ్‌ లాంచ్‌ ఎప్పుడంటే!

Motorola Edge 30 Fusion, Motorola Edge 30 Ultra Launch On Sep 13 India - Sakshi

అమెరికా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మోటోరోలా (Motorola) అదిరిపోయే స్పెసిఫికేషన్లతో రెండు మొబైల్స్‌ని భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్‌ చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా (Motorola Edge 30 Ultra), మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ (Motorola Edge 30 Fusion) పేరుతో ఈ రెండు సెప్టంబర్‌ 13న ఇండియన్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ విషయాన్ని మోటోరోలా అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా 200 మెగాపిక్సెల్ కెమెరా కావడం.. ఈ ఫోన్‌ ప్రత్యేకతని చెప్పచ్చు. మరోరకంగా చెప్పలంటే ఇంత భారీ స్థాయిలో పిక్సల్‌ కెమెరాతో దేశంలో లాంచ్ కానున్న తొలి మొబైల్ కూడా ఇదే. అదిరిపోయే దీని ప్రత్యేకతలు, ఫీచర్లను ఓ లుక్కేద్దాం.

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ప్రత్యేకతలు
►క్వాల్‌కామ్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్.
►ఎడ్జ్ 30 అల్ట్రా ట్రిపుల్ కెమెరా సెటప్‌, 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ సెన్సార్. ముందు భాగంలో, 60-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
►6.67-అంగుళాల పూర్తి-HD+ OLED డిస్‌ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌
►4,160mAh బ్యాటరీ, 125వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, వైర్‌లెస్ చార్జింగ్. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు.

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ప్రత్యేతలు
►స్నాప్‌డ్రాగన్ 888+ (Qualcomm Snapdragon)  ప్రాసెసర్,
►6.55 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ pOLED డిస్‌ప్లే. 144Hz రిఫ్రెష్ రేట్, హెచ్‌‌డీఆర్ 10+ సపోర్ట్.
►Motorola Edge 30 Fusion వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.
కెమెరా పరంగా, ఎడ్జ్ 30 ఫ్యూజన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్,  2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ముందు భాగంలో, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
►4,400mAh బ్యాటరీ, 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.

ఇప్పటికే ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు యూరోపియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యాయి. ఎడ్జ్‌ 30 ప్యూజన్‌ ఐరోపాలో 600 యూరోలు (సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ. 48,000) ఉంటుందని అంచనా. ఇది ఫ్యూజన్ కాస్మిక్ గ్రే, అరోరా వైట్, సోలార్ గోల్డ్, నెప్ట్యూన్ బ్లూ వంటి కలర్స్‌లో లభ్యమవుతుంది. అదేవిధంగా, ఎడ్జ్ 30 అల్ట్రా ధర 899.99 యూరోలు (సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ. 72,900) ఉంటుందని అంచనా. ఈ మొబైల్‌ స్టార్‌లైట్ వైట్, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ రంగులలో వస్తోంది.

చదవండి: ట్విటర్‌పై మరో బాంబు వేసిన ఎలాన్‌ మస్క్‌

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top