Google CEO Sundar Pichai Hints at Second Round of Layoffs - Sakshi
Sakshi News home page

గూగుల్‌లో మరో రౌండ్‌ తొలగింపులు తప్పవా?సుందర్‌ పిచాయ్‌ కీలక సంకేతాలు

Apr 13 2023 4:22 PM | Updated on Apr 13 2023 4:50 PM

More Layoffs coming at Google CEO Sundar Pichai Hints - Sakshi

న్యూఢిల్లీ:  టెక్‌ దిగ్గజం గూగుల్‌ మరోసారి ఉద్యోగాలపై వేటు వేయనుందా అంటే అవుననే సంకేతాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. జనవరిలో మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఆరు శాతం లేదా 12వేల  మంది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన గూగుల్‌ ఇపుడు రెండో రౌండ్‌కు సిద్ధమవుతోంది.  ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండో రౌండ్ తొలగింపులు ఉండవచ్చని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సూచనప్రాయంగా తెలిపారు. త్వరలో మరిన్ని తొలగింపులు జరగ వచ్చని పిచాయ్ వ్యాఖ్యానించడంతో గూగుల్‌ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. 

(ఇదీ చదవండి: MG Comet EV: ఎంజీ స్మార్ట్ కాంపాక్ట్ కామెట్‌ ప్రొడక్షన్‌ షురూ, లాంచింగ్‌ సూన్‌!)

కంపెనీలో త్వరలో మరిన్ని తొలగింపులు ఉండవచ్చని  ఇంటర్వ్యూలో పిచాయ్‌ వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే ఏ ఏ విభాగాలు, ఏంతమంది ప్రభావితమవుతా రనేది ప్రస్తావించలేదు. కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ బార్డ్‌, జీమెయిల్‌, గూగుల్‌ డాక్స్‌పై కీలక ప్రాజెక్టులు  కొనాసగుతున్నాయనీ, వీటిలో ఇంకా చాలా పనిచేయాల్సి ఉందని  చెప్పారు. దీనికనుగుణంగానే తమ సిబ్బందిని అధిక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుల్లోకి తరలిస్తున్నామని పేర్కొన్నారు.

కంపెనీ సామర్థ్యాన్ని 20 శాతం ఎలా పెంచనున్నారనే ప్రశ్నకు సమాధానమిస్తూ, కంపెనీలో జరుగు తున్న ప్రతీ అంశాన్ని పరిశీలిస్తున్నామనీ, అభివృద్ధి జరిగినా మరిన్ని పనులు చేయాల్సి ఉందని ఉద్ఘాటించారు. ఖర్చులను సమీక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీంతో మరోసారి తొలగింపులు అంచనాలు టెక్‌ వర్గాల్లో నెలకొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement