మూన్‌లైటింగ్‌ ఆదాయాన్ని దాచిపెడితే: లేటెస్ట్‌ వార్నింగ్‌

Moonlighting Can Have Tax Implications Warn Income Tax Authorities - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లో ప్రకంపనలు రేపిన మూన్‌లైటింగ్‌పై తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగులకు అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చే  అసైన్‌మెంట్‌లు లేదా ఉద్యోగాలపై ఆదాయపు పన్ను అధికారులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఆదాయంపై కూడా నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుందని మూన్‌లైట్ ఉద్యోగులను హెచ్చరించినట్లు  ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

రూ. 30 వేలు దాటితే టీడీఎస్
తాజాగా, ఈ ‘మూన్‌ లైటింగ్’ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ కూడా దృష్టిసారించింది. రెండో ఉద్యోగంలో సంపాదించే దానికి కూడా పన్ను చెల్లించాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేసింది. పన్ను నిబంధనలు రెండో ఉద్యోగానికి కూడా వర్తిస్తాయని తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గానీ, ప్రొఫెషనల్ ఉద్యోగులకు కానీ ఏ కంపెనీ అయినా  ఇచ్చే వ్యక్తిగత చెల్లింపులుసహా రూ. 30 వేలు దాటితే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ (టీడీఎస్) వర్తిస్తుందని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రిన్సిపల్ చీఫ్ ఐటీ కమిషనర్ ఆర్.రవిచంద్రన్ స్పష్టం చేశారు.  (Apple సత్తా: ఆ మూడు దిగ్గజాలకు దిమ్మతిరిగింది అంతే!)

మూన్‌లైటింగ్‌ ఉద్యోగులు తమ ఆదాయ  పన్ను రిటర్న్‌లలో ఏదైనా అదనపు ఆదాయాన్ని ప్రకటించి, వర్తించే పన్ను చెల్లించాలని ఉద్యోగులను కోరారు. అలా చేయకపోతే జరిమానా లాంటి  చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది. విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ హెచ్చరించిందిఏదైనా కంపెనీ లేదా వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగం ద్వారా సంపాదించే రూ 30వేల రూపాయల లోపు ఆదాయానికి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుందని పరిమితి దాటితే   టీడీఎస్‌  చెల్లించాలని  రవిచంద్రన్  స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194C ప్రకారం కాంట్రాక్ట్ పని కోసం చేసే చెల్లింపుల నుంచి టీడీఎస్‌ను మినహాయించాలి. ఏదైనా సంస్థ, ట్రస్ట్ కానీ, కంపెనీ, స్థానిక యంత్రాంగం వంటివి దీని కిందికి వస్తాయి. నగదు చెల్లింపులు, చెక్, డ్రాఫ్ట్ ఎలా చెల్లించినా సరే టీడీఎస్‌ మినహాయింపు తప్పనిసరి. ఐటీ చట్టంలోని సెక్షన్ 194జె ప్రకారం రూ. 30 వేలు దాటిన తర్వాత 10 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయించాలి. అంతేకాదు, ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపు లక్ష రూపాయలు దాటినప్పుడు కూడా టీడీఎస్‌ను మినహాయించాల్సి ఉంటుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top