ఏడాది కాలంలో 47 శాతం పెరిగిన ఇంటర్నెట్ డౌన్​లోడ్ స్పీడ్

Mobile Internet Download Speed Increase in India The Last 1 Year - Sakshi

భారతదేశంలోని మొబైల్, ఫిక్స్​డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగాలను జూన్ లో ఓక్లా పరీక్షించి విడుదల చేసిన స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ లో గతంలో కంటే మెరుగైన స్థానాన్ని సాధించుకుంది. దేశంలో మేలో సగటు మొబైల్ డౌన్​లోడ్ వేగం 15.34 ఎంబీపీఎస్ నుంచి 17.84 ఎంబీపీఎస్(16.3 శాతం పెరిగి)కు చేరుకుంది. మొబైల్ ఇంటర్నెట్ తో పాటు, దేశంలో సగటు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగం 4.53 శాతం పెరిగి 55.65 ఎంబీపీఎస్ నుంచి 58.17 ఎంబీపీఎస్ కు పెరిగింది.

జూన్ లో మొబైల్, ఫిక్స్​డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగాల పరంగా రెండూ గ్లోబల్ ఇండెక్స్ లో మంచి స్థానాన్ని పొందాయి. స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ జూన్ డేటా ప్రకారం.. మొబైల్  ఫిక్సిడ్ బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ వేగాలు వరుసగా ఆరు స్థానాలు పెరిగి 122 వ స్థానానికి, మూడు పాయింట్లు పెరిగి 70కి చేరుకుంది. గత రెండు నెలలుగా మొత్తంగా మొబైల్ డౌన్​లోడ్ వేగంలో స్థిరమైన మెరుగుదలను చూపించినట్లు ఓక్లా తెలిపింది.

జూన్ లో మొబైల్ ఇంటర్నెట్ వేగం
ఓక్లా విడుదల చేసిన స్పీడ్ టెస్ట్ డేటా ప్రకారం.. దేశంలో గత ఏడాది జూన్ 2020లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 12.16 ఎంబీపీఎస్ ఉంటే ఈ ఏడాది 17.84 ఎంబీపీఎస్ గా ఉంది. అంటే ఏడాది కాలంలో 46.71 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. దేశంలో సగటు మొబైల్ అప్ లోడ్ వేగం కూడా గత ఏడాది ఇదే నెలలో 4.35 ఎంబీపీఎస్ ఉంటే జూన్ 2021లో 18.85 శాతం పెరిగి 5.17 ఎంబీపీఎస్ కు చేరుకుంది.  మొబైల్ నెట్ వర్క్ లపై దేశంలో సగటు లేటెన్సీ రేటు మే లో 50 మిల్లీసెకన్ల నుంచి జూన్ లో 48 మిల్లీ సెకన్లకు పడిపోయింది. సగటు జిట్టర్ రేటు కూడా మేలో 48 మిల్లీ సెకన్ల నుండి జూన్ లో 43 మిల్లీ సెకన్లకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఓక్లా నిర్వహించిన స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) సగటు మొబైల్ డౌన్​లోడ్ వేగం 193.51 ఎంబీపీఎస్ తో తన ఆధిక్యాన్ని కొనసాగించింది. తర్వాత దక్షిణ కొరియా 180.48 ఎంబీపీఎస్ వద్ద ఉంది. 

జూన్ లో ఫిక్స్​డ్ బ్రాడ్ బ్యాండ్ వేగం
ఇక ఫిక్స్​డ్ బ్రాడ్ బ్యాండ్ విషయానికి వస్తే ఓక్లా స్పీడ్ టెస్ట్ డేటా ప్రకారం.. భారతదేశంలో సగటు డౌన్​లోడ్ వేగం జూన్ 2021లో 58.17 ఎంబీపీఎస్ గా ఉంటే, జూన్ 2020లో 38.19 ఎంబీపీఎస్ గా ఉంది. అంటే ఏడాది కాలంలో 52.32 శాతం పెరుగుదలను నమోదు సూచిస్తుంది. మరోవైపు దేశంలో సగటు ఫిక్స్​డ్ బ్రాడ్ బ్యాండ్ అప్ లోడ్ వేగం 2021 జూన్ లో 54.43 ఎంబీపీఎస్ కు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే నెలలో 34.22 ఎంబీపీఎస్ నుంచి 59.06 శాతం పెరిగింది. దేశంలో ఫిక్స్​డ్ బ్రాడ్ బ్యాండ్ సగటు లేటెన్సీ రేటు జూన్ లో ఒక మిల్లీ సెకను నుంచి 17 మిల్లీసెకన్లకు పెరిగింది. జూన్ లో సగటు బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ వేగం పరంగా 260.74 ఎంబీపీఎస్ తో మొనాకో అగ్రదేశంగా అవతరించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top