
జెఎస్‌బ్ల్యు-ఎంజీ మోటార్ ఇండియా ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీని అధికారికంగా లాంచ్ చేసింది. భారత్‌లో రూ .69.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభించే ఈ మోడల్‌ను రూ.1 లక్ష చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.
ఎంజీ సెలెక్ట్ చైన్ ఆఫ్ డీలర్ షిప్ ల ద్వారా విక్రయించే కొత్త ఎం9 ఈవీ డెలివరీలు ఆగస్టు 10 న ప్రారంభం కానున్నాయి. కియా కార్నివాల్, టయోటా వెల్ ఫైర్ లకు పోటీగా వస్తున్న ఈ ఈవీలో 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ తో 241 బీహెచ్‌పీ, 350 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. 548 కిలోమీటర్ల (ఎంఐడిసి సైకిల్) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ఎంజీ ఎం9 ఈవీ ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే లెవల్ 2 ఏడీఏఎస్ సూట్, ఎలక్ట్రిక్ స్లైడింగ్ రియర్ డోర్లు, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లతో కూడిన 16-వే అడ్జస్టబుల్ సెకండ్-లైన్ సీట్లు, పవర్డ్ బాస్ మోడ్, డ్రైవర్, ప్యాసింజర్ కోసం వెల్ కమ్ సీట్ ఫంక్షన్, ఏడు ఎయిర్ బ్యాగులు, ఆటో హోల్డ్ తో కూడిన ఈపీబీ, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ యూనిట్, ఏడు అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే, 13-స్పీకర్ జేబీఎల్ మ్యూజిక్ సిస్టమ్ 360 డిగ్రీల కెమెరా, డ్రైవ్ మోడ్స్ (ఎకో, నార్మల్, స్పోర్ట్) వంటివి ఉన్నాయి.