ధరలు.. ఇంకాస్త పైకి | march retail inflation rises essential prices india | Sakshi
Sakshi News home page

ధరలు.. ఇంకాస్త పైకి

Apr 14 2026 10:43 AM | Updated on Apr 14 2026 10:53 AM

march retail inflation rises essential prices india

న్యూఢిల్లీ: మార్చిలో నిత్యావసరాల ధరలు మరింత పెరిగాయి. రిటైల్‌ ధరల ఆధారిత సూచీ (రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని సూచించే ) 3.4 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో ఇది 3.21 శాతంగా ఉంది. ముఖ్యంగా మార్చి నెలలో బంగారం, వెండి ఆభరణాలు, కొబ్బరి, టమాటా, క్యాలిఫ్లవర్‌ ధరలు పెరిగాయి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, వెల్లుల్లి, కందిపప్పు, శనగపప్పు ధరలు తగ్గినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన డేటా ఆధారంగా తెలుస్తోంది. అయినప్పటికీ మార్చి నెల ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతానికి దిగువనే ఉండడం గమనార్హం. ఈ గణాంకాలు 2024 బేస్‌ ఇయర్‌ ఆధారంగా రూపొందించినవి.  

  •  విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధన విభాగంలో ద్రవ్యోల్బణం 1.65 శాతం నమోదైంది. ఫిబ్రవరిలో ఇదే విభాగం ద్రవ్యోల్బణం 1.52 శాతంగా ఉంది. 

  •  గ్రామీణ ప్రాంతాల్లో 3.63 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.11 శాతం చొప్పున మార్చి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదైంది. 

  •  దేశవ్యాప్తంగా చూస్తే అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలో 5.83 శాతంగా ఉంది. అత్యల్పంగా మిజోరాంలో 0.66 శాతం నెలకొంది. 


పశ్చిమాసియా ప్రభావం.. 
పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం కొంత మేర ద్రవ్యోల్బణంలో కనిపించినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. ప్రధానంగా ఆహారం, విద్యుత్, గ్యాస్‌ ధరల పెరుగుదలతో నెలవారీగా ద్రవ్యోల్బణం ఎగసినట్టు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement