మహీంద్రా మాన్యులైఫ్‌ నుంచి కొత్త ఫండ్‌

Mahindra Manulife Is Introducing New Fund Scheme - Sakshi

మహీంద్రా మాన్యులైఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ తాజాగా ఫ్లెక్సి క్యాప్‌ యోజన పేరిట కొత్త ఫండ్‌ ఆఫర్‌ను (ఎన్‌ఎఫ్‌వో) ప్రకటించింది. లార్జ్‌ క్యాప్, మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీర్ఘకాలికంగా ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో చేసే పెట్టుబడుల వృద్ధిని ఆశించే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని సంస్థ ఎండీ, సీఈవో అశుతోష్‌ బిష్ణోయి తెలిపారు. జులై 30న ప్రారంభమైన ఈ ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆగస్టు 13న ముగుస్తుందని చెప్పారు. తిరిగి ఆగస్టు 25 నుంచి విక్రయాలు, కొనుగోళ్లకు ఈ స్కీమ్‌ అందుబాటులోకి వస్తుందని వివరించారు.

ఫ్లెక్సి క్యాప్‌ యోజన ఫండ్‌ ద్వారా సమీకరించిన నిధుల్లో 65 శాతం భాగాన్ని ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు బిష్ణోయి పేర్కొన్నారు. ఇక మిగతా నిధులను రెపో, రివర్స్‌ రెపో వంటి డెట్, మనీ మార్కెట్‌ సాధనాల్లో 35 శాతం దాకా, అలాగే రీట్స్‌ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు), ఇన్విట్స్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు) యూనిట్లలో 10 శాతం దాకా ఇన్వెస్ట్‌ చేయవచ్చన్నారు.  ఈక్విటీల ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ఫ్లెక్సి క్యాప్‌ ఫండ్స్‌  స్థిరమైన రాబడులు అందించగలుగుతాయని పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top