యూనిటెక్‌ గ్రూప్‌ కేసులో లండన్‌ హోటల్‌ జప్తు

London Hotel Seized In Money Laundering Probe Against Unitech Group - Sakshi

న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ యునిటెక్, ఆ గ్రూప్‌ ప్రమోటర్ల సంజయ్‌ చంద్ర, అజయ్‌ చంద్రపై జరుగుతున్న అక్రమ ధనార్జనా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కీలక చర్య తీసుకుంది. లండన్‌లోని రూ.58.61 కోట్ల విలువచేసే ఒక హోటల్‌ను జప్తు చేసినట్లు ప్రకటించింది. ఈ హోటెల్‌ పేరు ‘బెడ్‌ అండ్‌ బ్రేక్‌ఫాస్ట్‌’. ఐబోర్న్‌షోర్న్‌కు చెందిన హోటెల్‌ ఇది. బ్రిటన్‌ కేంద్రంగా పనిచేస్తున్న కార్నౌస్టీ గ్రూప్‌కు అనుబంధ సంస్థగా ఐబోర్న్‌షోర్న్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈడీ తెలిపిన సమాచారం ప్రకారం, గృహ కొనుగోలుదారులకు చెందిన రూ.325 కోట్లను యూనిటెక్‌ గ్రూప్‌ కార్నౌస్టీ గ్రూప్‌కు బదలాయించింది. కార్నౌస్టీ గ్రూప్‌కు చెందిన కార్నౌస్టీ మేనేజ్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌ పేరుతో  ఐబోర్న్‌షోర్న్‌లో షేర్ల కొనుగోలుకు ఈ నిధుల్లో కొంత మొత్తాన్ని (రూ.41.3 కోట్లను) వినియోగించడం జరిగింది. ఈ కేసులో జరిగిన మోసం మొత్తం రూ.5,063.05 కోట్లని ఇప్పటి వరకూ అంచనా.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top