మూడు కోట్ల ఖరీదైన కారు.. ఆ సమస్యతో రీకాల్‌

Lamborghini Urus recalled in India - Sakshi

లగ్జరీ స్పోర్ట్స్‌ కార్‌ సెగ్మెంట్‌లో  లంబోర్గిని స్ట్రేచరే వేరు. లుక్‌, డిజైన్‌, కెపాసిటీ ఇలా అన్ని విభాగాల్లో లోపాలకు తావే లేకుండా ఉంటుంది. అందుకే ఈ కాస్ట్‌లీ కారుకి ఇండియాలో కూడా ఫాలోయింగ్‌ ఎక్కువే. అయితే ఓ లోపం కారణంగా ఈ కారుని లంబోర్గిని రీకాల్‌ చేసింది. 

లగ్జరీ కార్ల సెగ్మెంట్‌లో ఫోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ లంబోర్గిని బ్రాండ్‌తో కార్లను మార్కెట్‌లోకి తెస్తోంది. ఇందులో ప్రస్తుతం ఉరూస్‌ మోడల్‌కి ఫుల్‌ క్రేజ్‌ ఉంది. ఈ కారు ఇండియాలో ఎక్స్‌ షోరూం ధర రూ. 3.10 కోట్లుగా ఉంది. బిజినెస్‌ మ్యాగ్నెట్లు, సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఈ మోడల్‌ కార్లను వినియోగిస్తున్నారు. 

ఇండియాలో లంబోర్గిని ఉరూస్‌ మోడల్‌ కార్లు 300ల వరకు ఉన్నాయి. అయితే ఇటీవల ఈ కార్లలో లోపాలను ఉన్నట్టుగా లంబోర్గిని దృష్టికి వచ్చింది. వెంటనే ఆయా కార్లను పరిశీలించింది.

2021 ఫిబ్రవరి 12 నుంచి 24 మధ్య తయారైన కార్లలో  సీటు బెల్టుకి సంబంధించి ఆటోమేటిక్‌ లాకింగ్‌ రిట్రాక్టర్‌ (ఏఎల్‌ఆర్‌) ఫంక‌్షన్‌లో లోపాలు ఉన్నట​‍్టుగా తేలింది.  ఇలాంటి లోపాలు ఇండియాలో మూడు కార్లలో ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే లోపాలు ఉన్న కార్లను అక్టోబరు 1న వెనక్కి తీసుకోనుంది లంబోర్గిని. 

లంబోర్గిని కార్ల క్వాలిటీ విషయంలో ఫోక్స్‌వ్యాగన్‌ అస్సలు కాంప్రమైజ్‌ కాదు. ఈ ఘటన జరగడానికి ముందు 2020 డిసెంబరులో ప్రపంచ వ్యాప్తంగా స్వల్ప లోపాలు ఉన్న 80 ఉరూస్‌ కార్లను వెనక్కి తీసుకుంది.

లంబోర్గిని ఉరుస్‌లో 4 లీటర్‌ ట్విన్‌ టర్బో వీ 8 ఇంజన్‌ అమర్చారు. ఈ కారు కేవలం 3.6 సెకన్ల వ్యవధిలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. 

లంబోర్గిని ఉరుస్‌ కార్లను 2018లో మార్కెట్‌లోకి తెచ్చారు. ఫస్ట్‌బ్యాచ్‌లో 1000 కార్లను తయారు చేయగా అందులో ఇండియాకి 25 కార్లను కేటాయించారు.  
 

చదవండి : Tesla Cars:'టెస్లా చెత్త కారు'..రివ్యూపై చర్యలకు సిద్ధమైన ఎలాన్‌ మస్క్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top