ఎఫ్‌డీ చేసేవారికి గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేటు పెంపు | Kotak Mahindra Bank increases FD rates by up to 25 bps | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీ చేసేవారికి గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేటు పెంపు

Feb 10 2023 5:59 AM | Updated on Feb 10 2023 12:37 PM

Kotak Mahindra Bank increases FD rates by up to 25 bps - Sakshi

ముంబై: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (ఎఫ్‌డీలు) వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం పెంచిన 24 గంటల్లోనే కోటక్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ రేట్లను సవరించింది. రుణ రేట్లు డిపాజిట్‌ రేట్లతో అనుసంధానమై ఉంటాయని తెలిసిందే.

రూ.2 కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10 శాతానికి చేరింది. రూ.2–5 కోట్ల డిపాజిట్లపై రేటు 7.25 శాతానికి చేరింది. ‘‘ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఈ ప్రయోజనాన్ని మా విలువైన కస్టమర్లకు బదిలీ చేయాలని, వారి పొదుపు నిధులపై అధిక రాబడులను ఆఫర్‌ చేయాలని నిర్ణయించాం’’అని కోటక్‌ బ్యాంక్‌ ప్రకటించింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement