కియా కా కమాల్‌... రికార్డు సృష్టిస్తోన్న ఆ మోడల్‌ కారు అమ్మకాలు

Kia Sonet Sales Crossed One Lakh In One Year Of Span - Sakshi

Kia Sub Compact SUV Car Sonet Sales: అతి తక్కువ కాలంలోనే ఆటోమొబైల్‌ మార్కెట్‌పై చెదరని ముద్ర వేసిన కియా.. తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఆ కంపెనీ నుంచి వస్తున్న ప్యాసింజర్‌ వెహికల్స్‌ ఒకదాని వెంట ఒకటిగా అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్నాయి.

ఏడాదిలోనే
కియా కంపెనీ కార్లు ఇండియన్‌ రోడ్లపై రివ్వుమని దూసుకుపోతున్నాయి. ఇప్పటికే కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సెల్టోస్‌ అమ్మకాలు అదుర్స్‌ అనే విధంగా ఉండగా ఇప్పుడు సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోనూ అవే ఫలితాలు రిపీట్‌ అవుతున్నాయి. గతేడాది సెప్టెంబరులో మార్కెట్‌లోకి వచ్చిన కియా సోనెట్‌ అమ్మకాల్లో అప్పుడే లక్ష మార్కును అధిగమించింది. ఈ మోడల్‌ రిలీజైన ఏడాదిలోగానే లక్షకు పైగా అమ్మకాలు జరుపుకుని రికార్డు సృష్టించింది.

గడ్డు పరిస్థితులను ఎదుర్కొని
వాస్తవానికి కరోనా ఫస్ట్‌ వేవ్‌ ముగిసన తర్వాత ఆటోమైబైల్‌ రంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంది. మార్కెట్‌ ఇంకా గాడిన పడకముందే 2020 సెప్టెంబరు 20న సొనెట్‌ మోడల్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది కియా. ఆ కంపెనీ అంచనాలను సైతం తారు మారు చేస్తూ 12 నెలల వ్యవధిలోనే లక్ష కార్లు అమ్ముడయ్యాయి. కియా అమ్మకాల్లో ఒక్క సోనెట్‌ వాటానే 32 శాతానికి చేరుకుందని ఆ కంపెనీ మార్కెటింగ్‌ అండ్‌ సేల​‍్స్‌ చీఫ్‌ , ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టియో జిన్‌ పార్క్‌ తెలిపారు. 

టెక్నాలజీ అండతో..
సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి బ్రెజా, హ్యుందాయ్‌ వెన్యూ, టాటా నెక్సాన్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వంటి ప్యాసింజర్‌ వెహికల్స్‌ నుంచి పోటీని తట్టుకుంటూ కియో సోనెట్‌ భారీగా అమ్మకాలు సాధించడం వెనుక టెక్నాలజీనే ప్రముఖ పాత్ర పోషించినట్టు మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. ఈ సెగ్మెంట్‌లో టెక్నాలజీలో సోనెట్‌ మెరుగ్గా ఉన్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్‌ స్టెబులిటీ కంట్రోల్‌ (ఈఎస్‌సీ), వెహికల్‌ స్టెబులిటీ మేనేజ్‌మెంట్‌ (వీఎస్‌ఎమ్‌), బ్రేక్‌ అసిస్ట్‌ (బీఏ), హిల్‌ అసిస్ట్ కంట్రోల్‌ (హెచ్‌ఏసీ), పెడల్‌ షిప్టర్స్‌, వాయిస్‌ కమాండ్‌ ఆపరేటెడ్‌ సన్‌ రూఫ్‌ తదితర ఫీచర్లు ఈ కారుకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ప్రారంభ ధర రూ. 6.79 లక్షలు
కియా సోనెట్‌లో 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌తో వస్తోంది. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్లు అందిస్తోంది. ఈ కారు ప్రారంభం ధర రూ. 6.79 లక్షల నుంచి గరిష్టంగా రూ. 8.75 లక్షలు(షోరూమ్‌)గా ఉంది. గత సెప్టెంబరులో తొలి మోడల్‌ రిలీజ్‌ అవగా ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ 2021 మేలో మార్కెట్‌లోకి వచ్చింది. మొత్తంగా 17 రంగుల్లో ఈ కారు లభిస్తోంది. 
చదవండి: సెడాన్‌ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top