అదిరిపోయిన కియా ఎలక్ట్రిక్ ఎస్‌యువి కారు!

Kia EV9 electric SUV concept previewed ahead of  LA Auto Show - Sakshi

ప్రముఖ సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ప్రపంచంలో తన సత్తా చాటేందుకు సిద్దం అయ్యింది. తన కొత్త తరం ఈవీ9ను నవంబర్ 17న లాస్ ఏంజిల్స్ లో జరిగే ఆటో షోలో ప్రారంభించనున్నారు. అయితే, అరంగేట్రానికి ముందు కియా అధికారికంగా తన కాన్సెప్ట్ ఈవీ9 టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ఎస్‌యువి కారు విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. కియా కొత్త ఈవీ9 డిజైన్ చూస్తే సరికొత్తగా ఉంది. ఈవీ కారు ఫ్లాట్ రూఫ్ లైన్, పెద్ద వీల్ ఆర్చ్, స్లిమ్ ఎల్ఈడి డిఆర్ఎల్ సెక్షన్, ప్రముఖ ఫ్రంట్ గ్రిల్ తో వస్తుంది. 

ఈ కియా కొత్త కాన్సెప్ట్ ఈవీ9 బ్రాండ్ కారు ఇతర ఈవి కంటే పెద్దదిగా ఉంది. అమెరికాలో బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే ఈవి అమ్ముడైంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎస్‌యువి 400వీ,  800వీ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యువి కారును. ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో చార్జ్ చేస్తే ఐదు నిమిషాల్లోనే ఈవీ6 112 కిలోమీటర్లు, 18 నిమిషాలు చార్జ్ చేస్తే 330 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు అని కియా పేర్కొంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిమీ వెళ్లనుంది. ఇది 77.4కెడబ్ల్యుహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ కారు ధర రూ.44 లక్షలుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిని ఇండియాలోకి తీసుకొని వస్తారో లేదా అనే విషయంపై స్పస్టత లేదు. 

(చదవండి: ఎస్‌బీఐ వినియోగదారులకు అలర్ట్!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top