
టెక్నాలజీ పెరుగుతోంది, కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే కేరళకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒకరు 'టాక్ టు రైట్' అనే ఏఐ డివైజ్ రూపొందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
లింక్డ్ఇన్ పోస్ట్‌లో, అజయ్ హెచ్ అనే విద్యార్థి.. ఈ పరికరం AI బేస్డ్ వాయిస్-టు-పెన్ సిస్టమ్ అని, ఇది CNC పెన్ ప్లాటర్‌ని ఉపయోగించి మనం మాట్లాడే పదాలను చేతితో రాసిన టెక్స్ట్‌గా మారుస్తుందని వెల్లడించారు. ఈ పరికరాన్ని రాస్ప్బెర్రీ పై, ఆర్డునో (GRBL), పైథాన్‌లతో రూపొందించారని వెల్లడించారు. దీనిని ఎంటే కేరళం ఎక్స్‌పో 2025 (Ente Keralam Expo 2025)లో ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: ఏఐ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: గౌడత్ హెచ్చరిక
లింక్డ్ఇన్ పోస్ట్‌లో షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. అక్కడ అమర్చిన టాక్ టు రైట్ పరికరం మైక్‌లో అజయ్ మాట్లాడుతూ 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' అని చెబుతాడు. ఆ యంత్రం కాగితంపై ఆ ఎలాంటి తప్పులు లేకుండా రాస్తుంది. ఇది వైకల్యం ఉన్న వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.