Jio Fiber BroadBand: తెలుగు రాష్ట్రాల్లో 71 పట్టణాల్లో జియో ఫైబర్

Jio Fiber Brand Band Services Started In 71 Towns In Telugu States - Sakshi

దేశంలో అత్యంత వేగవంతమైన హై స్పీడ్ బ్రాడ్ బాండ్ గా పేరొందిన జియో ఫైబర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సేవలు భారీ స్థాయిలో విస్తరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో జియో ఫైబర్‌ సేవలు లభిస్తున్నాయి. జియోఫైబర్ వేగంగా విస్తరించడం విద్యారంగంలో ఉన్న వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా ఐటీ, ఇతర సేవా రంగాలకు చెందిన వారు వర్క్‌ ఫ్రం హోంకి అనుకూలంగా ఉంది. 

కొత్త యూజర్లకు
పోస్ట్ పెయిడ్ ప్లాన్ యూజర్లకు జియో ఫైబర్ ఇప్పుడు ఎలాంటి ప్రవేశరుసుము లేకుండానే లభిస్తుంది. యూజర్లు గనుక జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ను ఎంచుకుంటే, రూ.10,000 విలువ కలిగిన ఇంటర్నెట్ బాక్స్ (గేట్ వే రూటర్), సెట్ టాప్ బాక్స్, ఇన్ స్టాలేషన్ లను ఉచితంగానే పొందగలుగుతారు. మరో సంచలనాత్మక ఆఫర్ జియో ఫైబర్ ఎంటర్ టెయిన్ మెంట్ బొనాంజా. ఇది అదనంగా చెల్లించే రూ. 100తోనే అపరిమిత వినోదాన్ని అందిస్తుంది. వినియోగదారులు నెలకు రూ.399ల ప్రారంభ ధరతో అపరిమిత హైస్పీడ్ ఇంటర్నెట్ కు యాక్సెస్ పొందవచ్చు. నెలకు రూ.100 లేదా రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా వారు 14 ప్రముఖ ఓటీటీ యాప్స్ కలెక్షన్ నుంచి తమకు నచ్చిన కంటెంట్ ను చూడవచ్చు. 

ఏపీలో
ఆంధ్రప్రదేశ్‌లో జియో ఫైబర్ 43 నగరాలు, పట్టణాల్లో సేవలు అందిస్తోంది. వీటిలో  విజయవాడ, విశాఖపట్నం వంటి ముఖ్యమైన నగరాలతో పాటు అనకాపల్లి, అనంతపురం, భీమవరం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంతకల్, గుంటూరు, హిందూపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నందిగామ, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పెద్దాపురం, పొన్నూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం, తాడేపల్లె, తాడేపల్లెగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, వినుకొండ, విజయనగరం, వుయ్యూరులు ఉన్నాయి. 

తెలంగాణలో
తెలంగాణలో జియోఫైబర్ 28 నగరాలు, పట్టణాలకు తన సేవలను విస్తరించింది. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, బోధన్, భువనగిరి, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కోదాడ, కొత్తగూడెం, కామా రెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, మహేశ్వరం, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, సంగారెడ్డి, షాద్‌నగర్, శంకర్ పల్లి, సూర్యాపేట, తాండూర్, వనపర్తి, వరంగల్, జహీరాబాద్ లలో కూడా లభ్యమవుతుంది. త్వరలో మరో 7 పట్టణాలకు విస్తరించనుంది. 
చదవండి: జియో అదిరిపోయే బంపరాఫర్‌, రూ.200కే '14 ఓటీటీ' యాప్స్ సబ్‌స్క్రిప్షన్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top