డాక్టర్ అవ్వాలనుకున్న ఇస్రో ఛైర్మన్‌..! | Sakshi
Sakshi News home page

డాక్టర్ అవ్వాలనుకున్న ఇస్రో ఛైర్మన్‌..!

Published Thu, Oct 19 2023 7:58 PM

ISRO Chairman Wanted To Become A Doctor - Sakshi

సంక్లిష్టమైన చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని సుసాధ్యం చేసిన ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో)కు సారథ్యం వహిస్తున్న సంస్థ ఛైర్మన్‌ సోమనాథ్‌ తాను చిన్నతనంలో డాక్టర్ కావాలనుకున్నానని చెప్పారు. ఇటీవల చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ యూనివర్శిటీలో జరిగిన వైద్యుల సదస్సులో ఆయన్‌ ప్రసంగించారు. ఆయనకు బయాలజీ అంటే ఇష్టమనీ, తాను చిన్ననాటి నుంచి జీవశాస్త్రంలో టాపర్‌గా ఉండేవాడినని గుర్తుచేసుకున్నారు. డాక్టర్ కావాలనే ఆకాంక్ష బలంగా ఉండేదన్నారు.

అయితే వైద్య వృత్తి చాలా కఠినమైందని, ఇంజినీరింగ్ లేదా గణితాన్ని ఎంచుకోవాలని ఆయన తండ్రి చెప్పినట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి​ చేశాక ఎలాంటి స్పెషలైజేషన్ చేయలేదని సోమనాథ్ వెల్లడించారు. తాను మెకానికల్ ఇంజినీర్ కోర్సు చేస్తున్నపుడు ప్రొపల్షన్‌పై ఆసక్తి కలిగిందన్నారు. వైద్య నిపుణులు సాఫ్ట్‌వేర్, ఏఐ టూల్స్ గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. టెక్నాలజీ వినియోగం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement