గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌..! ఇకపై

Iocl Has Rolled Out A New Brand Of Liquefied Petroleum Gases Lpg Cylinders  - Sakshi

న్యూ ఢిల్లీ: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త..! ఇకపై గ్యాస్‌ ఎప్పుడు ఖాళీ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవడం మరింత సులువుకానుంది. అంతేకాకుండా గ్యాస్‌ సిలిండర్ల బరువు కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కొత్తగా స్మార్ట్‌ ఎల్‌పీజీ సిలిండర్లను విడుదల చేసింది.  వీటిని ఇండానే కాంపోజిట్ సిలిండర్లుగా పిలువనున్నారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్లతో కస్టమర్లు తమ తదుపరి రీఫిల్‌ను ఎప్పుడు బుక్‌ చేయాలనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చును.


ప్రస్తుతం ఐఓసీఎల్‌ విడుదల చేసిన  స్మార్ట్‌ సిలిండర్లతో గ్యాస్‌  ఎంత పరిమాణం ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చును. సాధారణంగా గ్యాస్‌ సిలిండర్లు స్టీల్‌తో చేస్తారు. కాగా  ఐఓసీఎల్‌ రిలీజ్‌ చేసిన స్మార్ట్‌ సిలిండర్లను హై-డెన్సిటీ పాలిథిలిన్(హెచ్‌డీపీఈ)తో తయారుచేశారు. ఈ సిలిండర్లు మూడు లేయర్ల నిర్మాణాన్ని కల్గి ఉంది.ఈ నిర్మాణంతో స్టీల్‌ సిలిండర్లు మాదిరి స్మార్ట్‌ సిలిండర్లు ధృడంగా ఉంటాయని తెలుస్తోంది.  

ఇండానే కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేకతలు 

నార్మల్‌ సిలిండర్ల కంటే ఈ సిలిండర్లు తేలికైనవి. ప్రస్తుతం ఉన్న సిలిండర్లలో సగానికిపైగా బరువు తగ్గనుంది.

ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. 

వినియోగదారులు సులభంగా రీఫిల్‌ చేసుకునేందుకు సహాయపడుతుంది. 

స్టీల్‌ సిలిండర్లు వినియోగించే కొద్దీ అవి తుప్పు పడతుంటాయి. కానీ ఈ సిలిండర్‌కు అలాంటి సమస్యలు ఉండవు. 

మూస పద్దతిలో కాకుండా ట్రెండ్‌కు తగ్గట్లు ఆధునిక పద్దతుల్లో దీన్ని డిజైన్‌ చేశారు.  

ప్రస్తుతం, ఈ స్మార్ట్ సిలిండర్లు న్యూఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ఫరీదాబాద్, లూధియానాలలో అందుబాటులో ఉన్నాయి. 

వినియోగదారుల సౌకర్యం కోసం 5 కిలోల నుంచి  10 కిలోల పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి. 

ఈ సిలిండర్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని ఐఓసిఎల్ ప్రకటించింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు ప్రస్తుతం ఉన్న ఎల్‌పిజి స్టీల్ సిలిండర్లకు బదులు ఈ స్మార్ట్‌ సిలిండర్లను మార్చుకునే సౌకర్యం ఉంది.  

ఇందుకోసం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ లేని ఈ సిలిండర్లకు సెక్యూరిటీ డిపాజిట్ కింద 10 కిలోల బరువు సిలిండర్‌ కు రూ .3350, 5 కిలోల బరువున్న సిలిండర్‌కు రూ .2150 చెల్లించాల్సి ఉంటుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top