ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు శుభవార్త! | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు శుభవార్త!

Published Mon, Oct 23 2023 12:37 PM

Infosys To Roll Out Hikes On November 1 - Sakshi

టెక్కీలకు ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ శుభవార్త చెప్పింది. సంస్థ గత ఆరు నెలలుగా జీతాల పెంపు ప్రకటనన వాయిదా వేస్తూ వచ్చింది. అయితే, తాజాగా ఇన్ఫోసిస్‌ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో నవంబర్‌ 1న ఉద్యోగుల వార్షిక వేతనాల్ని పెంచుతున్నట్లు కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ తెలిపారు.  

ఇన్ఫోసిస్‌ సాధారణంగా శాలరీలను ఏప్రిల్ నెలలో సీనియర్ మేనేజ్మెంట్ కంటే తక్కువ ఉన్న ఉద్యోగులందరికీ వార్షిక పెంపును అమలు చేస్తుంది. మిగిలిన ఉద్యోగులకు జూలైలో అందిస్తుంది. అయితే ఐటీ విభాగంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా చెల్లించే వేతనాలు, ఇతర బెన్ఫిట్స్‌ను వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా ఇదే అంశంపై క్లారిటీ ఇవ్వడంతో సంస్థ తీసుకున్న నిర్ణయంపై లక్షల మంది ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

టెక్నాలజీ రంగంలో అనిశ్చితే కారణం 
ఇతర రంగాలతో పాటు టెక్నాలజీ రంగంలో నెలకొన్ని అనిశ్చితి కారణంగా వేతనాల పెంపును వాయిదా వేసినట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు.   కాగా, ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.38,994 కోట్ల ఆదాయంపై రూ.6,215 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికరలాభం ఆర్జించింది

Advertisement
 
Advertisement