ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్‌!

Infosys allows WFH for 11 days per month - Sakshi

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ ఉద్యోగులను కంపెనీలు బలవంతంగా ఆఫీస్‌లకు పిలిపిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) కాస్త ఊరట కలిగిస్తోంది.  పూర్తిగా వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ కాకుండా హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తోంది. తాజాగా ఉద్యోగులకు నెలకు 11 రోజుల పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. 

ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల ఎక్స్‌పీరియన్స్‌ ప్లాట్‌ఫామ్ ఇన్ఫీమీ (InfyMe) కొన్ని ఎంపిక చేసిన ఆఫీసుల్లో నెలలో 11 రోజుల పాటు ఇంటి నుండి పని కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది. "మనం ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో ఉన్నాం. మీరు నెలకు పేర్కొన్న కొన్ని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రోజులను పొందవచ్చు మిగిలిన రోజులలో ఆఫీస్‌ నుండి పని చేయవచ్చు. అదనపు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోసం అభ్యర్థనలు మీ మేనేజర్ ఆమోదానికి లోబడి ఉంటాయి" అని ఇన్ఫీమీ ప్లాట్‌ఫామ్‌లోని సందేశం పేర్కొంది.

వారానికి ఐదు రోజులు వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ అమలు చేస్తున్న ఇతర కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్‌ గత సంవత్సరం నవంబర్ 20 నుండి జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులను నెలకు 10 రోజులు మాత్రమే వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ అమలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా కల్పించిన వెసులుబాటుతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు ఊరట కలుగుతుంది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top