
( ఫైల్ ఫోటో )
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఇండిగో.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి అయిదు నగరాలకు సర్వీసులు నడపనుంది. వీటిలో మార్చి 27 నుంచి చెన్నై, విజయవాడ, హైదరాబాద్, మార్చి 29 నుంచి విశాఖపట్నం, బెంగళూరులకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సర్వీసులు అందిస్తున్న నగరాల్లో కడప 73వది.
కరోనా విలయతాండవం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమాన పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. కరోనా నుంచి కోలుకునే సమయంలోనే ఫ్యూయల్ ధరల పిడుగుపడింది. దీంతో ఏవియేషన్ సెక్టార్ ఇప్పుడప్పుడే గాడిన పడదు అనే వాదనలు వినిపించాయి. కానీ కడప లాంటి టైర్ త్రీ సిటీస్‌లో కూడా తిరిగి విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఏవియేషన్ సెక్టార్ త్వరగా కోలుకుంటుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.