
దేశవ్యాప్తంగా రైలు ఛార్జీలు జూలై 1 నుంచి పెరుగుతున్నాయి. ఈ మేరకు సుదూర రైళ్లలో జూలై 1 నుంచి రైలు ఛార్జీలు పెంచనున్నట్లు భారతీయ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే బోర్డు నోటిఫికేషన్ ప్రకారం కిలోమీటర్‌కు గరిష్టంగా 2 పైసలు చొప్పున ఛార్జీల పెంపు ఉంటుంది. నాన్ ఏసీ బోగీల్లో కిలోమీటర్‌కు ఒక పైసా, ఏసీ బోగీల్లో కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. సబర్బన్ రైళ్లు, 500 కిలోమీటర్ల వరకు సాధారణ సెకండ్ క్లాస్ ప్రయాణాలపై ఎలాంటి ప్రభావం ఉండదు.
రైలు ఛార్జీలు ఎంత పెరుగుతాయంటే..
రైలు రకం | ఛార్జీల పెంపు.. |
---|---|
సెకండ్ క్లాస్ ఆర్డినరీ | 501-1500 కిలోమీటర్లకు రూ.5 పెంపు |
సెకండ్ క్లాస్ ఆర్డినరీ | 1501-2500 కిలోమీటర్లకు రూ.10 పెంపు |
సెకండ్ క్లాస్ ఆర్డినరీ | 2501-3000 కిలోమీటర్లకు రూ.15 పెంపు |
స్లీపర్ క్లాస్ జనరల్ | కిలో మీటరుకు అర పైసా |
ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ | కిలో మీటరుకు అర పైసా |
సెకండ్ క్లాస్ (మెయిల్/ఎక్స్‌ప్రెస్) | కిలో మీటరుకు ఒక పైసా |
స్లీపర్ క్లాస్ (మెయిల్/ఎక్స్‌ప్రెస్) | కిలో మీటరుకు ఒక పైసా |
ఫస్ట్ క్లాస్ (మెయిల్/ఎక్స్‌ప్రెస్) | కిలో మీటరుకు ఒక పైసా |
ఎసి చైర్ కారు | కిలో మీటరుకు రెండు పైసలు |
ఎసి-3 టైర్/3ఈ | కిలో మీటరుకు రెండు పైసలు |
ఏసీ-2 టైర్ | కిలో మీటరుకు రెండు పైసలు |
ఏసీ ఫస్ట్ క్లాస్/ఈసీ/ఈఏ | కిలో మీటరుకు రెండు పైసలు |
రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, ఏసీ విస్టాడోమ్ కోచ్, తదితర రైళ్లకు కూడా పైన పేర్కొన్న ప్రకారం ఛార్జీల పెంపు వర్తిస్తుంది. భారతీయ రైల్వే రైలు ఛార్జీలను పెంచడం 2022 తర్వాత ఇదే తొలిసారి. రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్ వంటి ఇతర ఛార్జీలు యథాతథంగా కొనసాగుతాయని భారతీయ రైల్వే తెలిపింది. మంత్లీ సీజన్ టికెట్స్ , సబర్బన్ రైలు ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు.
రిజర్వేషన్ చార్టుల్లో మార్పులు..
రైలు ఛార్జీలను పెంచడంతో పాటు, సుదూర రైళ్ల రిజర్వేషన్ చార్ట్‌లను బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు సిద్ధం చేస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. గతంలో రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ చార్టులు తయారు చేసేవారు.
తత్కాల్ బుకింగ్స్ లో మార్పులు?
తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్‌ను రైల్వే శాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఆధార్ ధృవీకరణ పూర్తి చేసిన ప్రయాణికులు మాత్రమే జూలై 1 నుండి ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా జూలై నెలాఖరు నుంచి తత్కాల్ బుకింగ్స్ కోసం ఓటీపీ ఆధారిత అథెంటికేషన్‌ను కూడా అమలు చేయనున్నారు.